ఏపీలో పెట్టుబడులు, ఉపాధి కల్పనపై కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. దేశ, విదేశాల చెందిన సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తోంది ఏపీ సర్కార్. ఇప్పటికే చాలా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ( ఎన్టీపీసీ ) ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
ఈ నేపథ్యంలో రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఎన్టీపీసీ. ఈ మేరకు గురువారం ( నవంబర్ 21, 2024 ) ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి సమక్షంలో ఒప్పందం జరిగింది.
Also Read : పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే 25 ఏళ్లలో ఏపీలో రూ.20,620 కోట్ల ఆదాయం రానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎన్టీపీసీ పెట్టే పెట్టుబడులతో 1.06 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలుస్తోంది. ఏపీలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఎన్టీపీసీ సంస్థ తన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకొచినట్లు తెలుస్తోంది.