ఎన్టీఆర్ అదుర్స్ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. కడుపుబ్బా నవ్వడానికి సిద్ధం కండి

ఎన్టీఆర్ అదుర్స్ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. కడుపుబ్బా నవ్వడానికి సిద్ధం కండి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), డైరెక్టర్ వి.వి. వినాయక్(V.V. Vinayak) దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్(Adurs). ఎన్టీఆర్ కెరీర్‌లో గుర్తుండిపోయే మూవీస్ లో అదుర్స్ ఒకటి. ఎన్టీఆర్ సినీ కెరీర్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. లేటెస్ట్ గా అదుర్స్ రీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీని 2023 నవంబర్ 18న వరల్డ్ వైడ్ గా 4k వెర్షన్ లో థియేటర్ల లో  రీ రిలీజ్ కానుంది.

అదుర్స్ మూవీలో చారి అనే బ్రాహ్మణుడి క్యారెక్టర్ లో.. ఎన్టీఆర్ తన సహజ నటనతో ఆకట్టుకున్నారు. తనదైన కామిక్ యాంగిల్ తో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. అంతేకాకూండా బ్రహ్మానందం శిష్యుడిగా ఎన్టీఆర్ అదరగొట్టి..ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకున్నారు. ఈ సినిమాతో బ్రహ్మీ..ఎన్టీఆర్ కాంబో అంటే స్పెషల్ క్రేజీ సొంతం చేసుకుంది.

అదుర్స్ మూవీ నందమూరి ఫ్యాన్స్ కు పిచ్చ క్రేజీ కావడంతో..వెండితెరపై మళ్లీ చూడాలని చాలా రోజులుగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ఏడాది 2023 మార్చి 4న  ఈ మూవీని రీరిలీజ్ చేయడానికి ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ, అనుకోని కారణాల వల్ల రిలీజ్ అవ్వడం ఆగిపోయింది. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అదుర్స్ రీ రిలీజ్ కావాలంటూ..కామెంట్స్ తో హోరెత్తించగా మేకర్స్ డిసైడ్ అయ్యారు. మొత్తానికి ఇన్నాళ్లకు ఈ సినిమాను రీరిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసి..నందమూరి ఫ్యాన్స్ లో జోష్ పెంచారు.

ALSO READ : ODI World Cup 2023:  ప్రపంచ కప్ ఫైనల్‍ చేరే రెండు జట్లు ఏవి..? 12 మంది మాజీ క్రికెటర్ల ప్రిడిక్షన్ 

ప్రస్తుతం అదుర్స్ మూవీ రిలీజ్ డేట్ సోహాల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి థియేటర్స్ లో ఎంజాయ్ చేయడానికి రెడీ గా ఉండండి అంటూ.. మేకర్స్ తెలిపారు.