DevaraSecondSingle: ఎన్టీఆర్..జాన్వీ రొమాంటిక్ ధమాఖా..దేవర సెకండ్ సింగిల్ రిలీజ్

DevaraSecondSingle: ఎన్టీఆర్..జాన్వీ రొమాంటిక్ ధమాఖా..దేవర సెకండ్ సింగిల్ రిలీజ్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్నారు.

తాజాగా ఈ బ్యూటిఫుల్ జోడీపై రూపొందిన దేవర సెకండ్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. 'చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు..ఆ జంట కన్నుల పంట..మాధుర్యపు తూగుటుయ్యాల' అంటూ సాగిన ఈ రొమాంటిక్ పాటకు సరస్వతి పుత్ర రామ జోగయ్య శాస్ట్రీ లిరిక్స్ అందించగా శిల్ప రావు పాడారు.

ఈ రొమాంటిక్ పాటకు బోస్కోమార్టిస్ డాన్స్ కంపోజ్ చేశారు. అలాగే ఈ పాటలో చెయ్యరా ముద్దుల దాడి..ఇష్టమేలే నీ సందడి' తో పాటు 'ఏ బంగరు నెక్లీసు..నా ఒంటికి నచ్చట్లే..నీ కౌగిలితో నను సింగారించు' అనే పదాలు ఎన్టీఆర్ రొమాంటిక్ నేచర్ను..తెలుపుతూ రాసిన గీతంగా కనిపిస్తోంది. మరి ఈ రొమాంటిక్ ధమాఖా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇటీవలే దేవర నుంచి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ ఎలాంటి భయాన్ని పుట్టించిందో తెలిసిందే. 'రాకే ఎగబడి రాకే..దూకే ధైర్యమా జాగ్రత్త' అంటూ సినీ ఫ్యాన్స్ లో ఓ ఫియర్ ఏరా క్రియేట్ చేశాడు.మరి చుట్టమల్లే అంటూ వచ్చిన ఈ సాంగ్ తో ఎలాంటి మైమరిచి మత్తును క్రియేట్ చేస్తుందో చూడాలి.  అయితే ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.