Daavudi Song: ‘దేవర’ థర్డ్ సింగిల్ రిలీజ్..ఎన్టీఆర్, జాన్వీ డ్యాన్స్ అదరహో

ఇప్పటికే రెండు పాటలతో ఆడియన్స్ కు బూస్ట్ ఇచ్చిన దేవర (Devara) మేకర్స్..మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ తో వచ్చారు. తాజాగా ‘దేవర’ నుంచి థర్డ్ సింగిల్ ' దావూదీ' సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా..బాలీవుడ్ క్రేజీ సింగర్ నకాష్ అజీజ్,ఆకాశ కలిసి పాడారు. శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ అందించారు. 

 దావూదీ పాట ప్రతి ఒక్క ఆడియన్ ను స్టెప్పులేసేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ (NTR), జాన్వీ(Janhvi Kapoor) డ్యాన్స్ పెర్ఫార్మన్స్కు షేక్..షేక్..షేక్..అందరూ షేక్. ఈ దేవర థర్డ్ సింగిల్తో మరోసారి ఆడియో బాక్సులు పగిలిపోయేలా ఉంది.'నకేలిసు నడుం గింగిర గింగిరా గింగిరామే..రంగుల పొంగుల బొంగరామే సన్నగా నున్నగా బళ్లెగా చెక్కావే'..'నీ ఏటావాలు చూపే యెన్నెల సాంబ్రాణి...నన్నెక్కించావే పిల్లా రెక్కల గుర్రాన్ని' అనే పదాలకు డ్యాన్స్  బీట్స్ అదిరిపోయాయి. ఈ పాట పక్కా బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఇప్పటికే చుట్టమల్లే సాంగ్ దాదాపు 125మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది. 

నిజానికి దేవరకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు అని తెలిసినప్పటినుండి ఈ సినిమా రేంజ్ మారిపోయింది. కారణం..అనిరుధ్ నుండి వచ్చిన గత చిత్రాలే. ఆయన మ్యూజిక్ అందించిన విక్రమ్, లియో, జైలర్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. అందుకే.. దేవర కోసం అనిరుధ్ అందించబోయే మ్యూజిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.అవే అంచనాలు తాజా దేవర సాంగ్స్ తో నిజమవుతున్నాయి. దేవర సెప్టెంబర్​ 27న సినిమా విడుదల కానుంది.