నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞతేజ డెబ్యూ మూవీని ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. శుక్రవారం సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా కొత్త సినిమా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సందర్బంగా మోక్షజ్ఞతేజకు టాలీవుడ్ ప్రముఖుల నుంచి బర్త్‌డే విషెష్ తో పాటు సినీరంగ ఎంట్రీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్..తన తమ్ముడి మోక్షజ్ఞకు అభినందనలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు.
ALSO READ | Mythri Movie Makers: వరద బాధితుల సహాయార్ధం..మైత్రీ మూవీ మేకర్స్ భారీ విరాళం
"సినీ ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు. కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు దేవుడి ఆశీర్వాదాలు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయి. హ్యాపీ బర్త్‌డే మోక్షు.." అని ట్విట్టర్ X ద్వారా తెలిపారు.
Congratulations on your debut into the world of cinema!
— Jr NTR (@tarak9999) September 6, 2024
May all the divine forces along with Thatha garu, shower blessings upon you as you begin a new chapter in your life!
Happy birthday Mokshu @MokshNandamuri pic.twitter.com/5LOBVLn862
అలాగే హీరో కళ్యాణ్ రామ్.."తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టేంత ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని మోక్షుకు విషెష్ తెలిపారు.
Welcome to the Tinsel Town Mokshu !!
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) September 6, 2024
తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…
Wish you a very very Happy Birthday!! pic.twitter.com/77PfROmkoJ
భారతీయ పురాణాలు, ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొందుతూ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రశాంత్ వర్మఈ మూవీని రూపొందిస్తోన్నట్లు సమాచారం. మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీలో పురాణాల్లోని గొప్ప యోధుడి ప్రస్తావన ఉంటుందని అంటున్నారు. ఈ మూవీని SLV బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి మరియు బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని సంయుక్తంగా నిర్మించనున్నారు.