ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాలతో నార్త్‌లోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్.. ప్రెజెంట్ బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో తారక్ క్యారెక్టర్‌కు సంబంధించి ఇంటరెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. హృతిక్ కంటే ఎన్టీఆర్ పాత్రకే స్ర్కీన్ టైమింగ్ ఎక్కువ ఉంటుందని, అలాగే ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.
వార్ ఫస్ట్ పార్ట్‌లో టైగర్ ష్రాఫ్ కనిపించినట్టే.. పార్ట్ 2లో ఎన్టీఆర్ కూడా హీరోగా, విలన్‌గా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడట. ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్టుగా ఓ ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్‌లో మెప్పించినా.. ‘లవకుశ’లో నటించిన పాజిటివ్, నెగిటివ్ పాత్రలు తరహాలో ‘వార్2’ క్యారెక్టర్ ఉండబోతోందనే టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్టు 14న సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’, కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర2’ చిత్రాలను ఈ ఏడాదిలోనే మొదలుపెట్టేలా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు.