JrNTR: బాక్సులు బ్లాస్ట్ చేసే 'ఆయుధపూజ' పాట ముహూర్తం ఖరారు..టైం ఇదే

JrNTR: బాక్సులు బ్లాస్ట్ చేసే 'ఆయుధపూజ' పాట ముహూర్తం ఖరారు..టైం ఇదే

దేవర..దేవర..దేవర..ఇప్పుడు నెలరోజులుగా సోషల్ మీడియాను దున్నేస్తోన్న ఎన్టీఆర్ మేనియా ఇది. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. వరుస సాంగ్స్ అప్డేట్స్ తో ఆడియన్స్ కి బూస్ట్ ఇస్తున్నారు. 

ఇప్పటికే మూడు పాటలతో ఆడియన్స్కు కిక్ ఇచ్చిన దేవర మేకర్స్..మరో ఇంట్రెస్టింగ్ సాంగ్తో రాబోతున్నారు. తాజాగా ‘దేవర’ నుంచి ఫోర్త్ సింగిల్ ' ఆయుధపూజ' సాంగ్ రిలీజ్ ముహూర్తం ఖరారైంది. రేపు గురువారం (సెప్టెంబరు 19న) 11: 07 గంటలకు ఆయుధపూజ పాటను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు. "మీరు అడిగారు మరియు మేము వెనక్కి తగ్గలేకపోయాము...రేపు ఉదయం 11:07 నుండి ఆయుధపూజ సంగీత పిచ్చిగా మారుతుంది" అంటూ క్యాప్షన్ జోడించారు. 

అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఇప్పటికే ఈ పాట అప్డేట్ గురించి, ఎన్టీఆర్ శివ తాండవం గురించి పలుమార్లు సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో రామ జోగయ్య శాస్త్రి పంచుకున్నారు. ఇక ఈ క్రేజీ అప్డేట్తో బాక్సులు బ్లాస్ట్ అవ్వడం కన్ఫమ్ అనే టాక్ ఉంది. మరి ఏమవుతుందో చూడాలి.