Chandrababu, Ntr: ప్రియమైన మామయ్యకి.. చంద్రబాబు విజయంపై ఎన్టీఆర్ ఆసక్తికర ట్వీట్

Chandrababu, Ntr: ప్రియమైన మామయ్యకి.. చంద్రబాబు విజయంపై ఎన్టీఆర్ ఆసక్తికర ట్వీట్

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి(టీడీపీ,జనసేన,బీజేపీ) ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కూటమి నుండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ, పురంధరీశ్వరి విజయబావుటా ఎగరేవేశారు. దీంతో రాజకీయ, సినీ ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఈ లిస్టులో చేశారు జూనియర్ ఎన్టీఆర్. 

కూటమి విజయంపై తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రియమైన నారా చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే.. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన భరత్, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు.. అని రాసుకొచ్చారు ఎన్టీఆర్. 

అలాగా జనసేన సాధించిన విజయంపై కూడా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్.. ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా శుభాకాంక్షలు.. అని ట్వీట్ చేశారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.