హైదరాబాద్ RTC క్రాస్ రోడ్డులో.. NTR కటౌట్ తగలబడింది..!

హైదరాబాద్ RTC క్రాస్ రోడ్డులో.. NTR కటౌట్ తగలబడింది..!

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన దేవర శుక్రవారం ( సెప్టెంబర్ 27, 2024 ) భారీ ఎత్తున విడుదలైంది. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన సినిమా కావడంతో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా సినిమా విడుదల సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ దగ్గర అపశృతి చోటు చేసుకుంది. థియేటర్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు అంటుకుంది.

ఎన్టీఆర్ కటౌట్ తగలబడుతున్న ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి. సినిమా నచ్చని కొంతమంది ఫ్యాన్స్ ఎన్టీఆర్ కటౌట్ ను తగలబెట్టారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే.. కటౌట్ ను ఫ్యాన్స్ తగలబెట్టలేదని, టపాసులు కాల్చుతుండగా ప్రమాదవశాత్తు కటౌట్ కు నిప్పు అంటుకుందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

కాగా.. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన దేవర సినిమా బెనిఫిట్ షోస్ నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయ్యిందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య సినిమాతో దారుణమైన డిజాస్టర్ చవిచూసిన కొరటాల దేవరతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారని కామెంట్ చేస్తున్నారు ఆడియెన్స్.