DevaraBookings: దేవర టికెట్స్ కోసం వెయిటింగా.. బుక్ చేసుకోండి మరి!

DevaraBookings: దేవర టికెట్స్ కోసం వెయిటింగా.. బుక్ చేసుకోండి మరి!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర (Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ సెప్టెంబరు 27న ప్రేక్షకుల  ముందుకు రానుంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. అటు యూఎస్‌లో ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి. కాగా దేవర ఒవర్సీస్ ప్రీ సేల్స్ బుకింగ్స్ తో మిలియన్ వ్యూస్ రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, FIJI మరియు PNG బుకింగ్స్ లో అదరగొడుతోంది. 

ముఖ్యంగా నార్త్ అమెరికా సేల్స్ ఓ రేంజ్లో దూసుకెళ్తున్నాయి. నార్త్ అమెరికా రైట్స్ ను ఇండియన్ రూపీస్ ప్రకారం 26 కోట్లకు అమ్ముడవగా అడ్వాన్స్ సేల్స్ రూపంలో ఇప్పటి వరకు రూ. 21 కోట్లు రాబట్టింది.

ALSO READ | Jr NTR: ఫ్యామిలీతో అమెరికా వెళ్లిన ఎన్టీఆర్..‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్టే!

ఇదిలా ఉంటే.. దేవర మూవీ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వడంతో.. తెలుగు రాష్ట్రాల్లోని తారక్ ఫ్యాన్స్ అడ్వాన్స్ బుకింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో స్టార్‌ హీరోల సినిమాల విడుదలకు వారం లేదా పది రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అవుతుంది. కొన్ని సార్లు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతుల కోసం చూస్తే అడ్వాన్స్ బుకింగ్‌ ఆలస్యం అవుతుంది.

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక షోలకి అనుమతి ఇవ్వడంతో..అక్కడ ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ఇప్పటికే అలోమోస్ట్ ఫుల్ అవుతున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర టికెట్స్ ను షోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక ఏపీలో దేవర ఫస్ట్ షో 1:30 am కి మొదలు కానుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచిస్పెషల్ షోలకి అనుమతి రావాల్సి ఉంది.