Devara: ఒవర్సీస్లో దేవర దూకుడు.. ప్రీ సేల్స్ బుకింగ్స్లో రికార్డుల వేట

Devara: ఒవర్సీస్లో దేవర దూకుడు.. ప్రీ సేల్స్ బుకింగ్స్లో రికార్డుల వేట

మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర (Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబడుతూ ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. దీంతో ఈ సినిమా నుంచి రాబోయే ప్రతి అప్డేట్పై ఫ్యాన్స్ తమ ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానుండగా..తాజాగా దేవర టీమ్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది. 

కాగా దేవర ఒవర్సీస్ ప్రీ సేల్స్ మిలియన్ వ్యూస్ రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, FIJI మరియు PNG ప్రీ సేల్స్ కౌంట్ అప్డేట్ ఇస్తూ.. "సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది! ప్రీ-సేల్స్‌లో $200k దాటి..ఇంకా లెక్కింపులో ఉంది! మరిన్ని స్థానాలు త్వరలో జోడించబడతాయి. చూస్తూ ఉండండి! "అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. 

అలాగే, నార్త్ అమెరికాలోను 1.67 మిలియన్ ప్రీ సేల్స్ కలెక్ట్ చేసి రికార్డు తిరగరాసింది దేవర. ఇక టికెట్స్ బుకింగ్స్ విషయంలోనూ దేవర తనడైన సత్తా చాటుతూ ఇదివరకు రికార్డులు నెలకొల్పిన మూవీస్ ను క్రాస్ చేస్తూ స్టామినా చూపిస్తోంది.

ఇప్పటివరకు 50,000 పైగా టికెట్స్ బుక్ అయి, రిలీజ్కు 7 రోజులు ఉండగా ఇంతటి భారీ స్థాయి బుకింగ్స్ సాధించిన సినిమాగా దేవర నిలిచింది. రిలీజ్ నాటికి 2.5 మిలియన్ కు పైగా రాబట్టి బాహుబలి – 2 ప్రీ సేల్స్ ను దేవర క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ వారం రోజుల్లో మరెలాంటి రికార్డులు నెలకొల్పనుందో చూడాలి. కాగా దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ సెప్టెంబర్ 22వ తేదీన హైదరాబాద్‍లో నోవాటెల్ HICCలో జరగనుంది.