Devara Pre Release Event: దేవర మొదటి అడుగు రేపే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎక్కడ జరగనుందంటే?

Devara Pre Release Event: దేవర మొదటి అడుగు రేపే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎక్కడ జరగనుందంటే?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) చేస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ దేవర(Devara). స్టార్ డైరెక్టర్ శివ కొరటాల(Shiva Koratala) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా నుండి అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్ లో హైప్ పెంచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మేకర్స్ ఓ వైపు వరుస ప్రమోషన్స్..మరోవైపు ఓవర్సీస్ ప్రీ సేల్స్ మిలియన్ల వ్యూస్ దూసుకెళ్తోంది.ఇక ఇదే ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడం కోసం దేవర మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు.

దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి శుక్రవారం (సెప్టెంబర్ 20న) మేకర్స్ వెల్లడించారు. "భయం అనేది ధైర్యం ఉన్నవారికే కాదు..ఇది కూడా వేడుక కోసం కూడా..బిగ్ ఫెస్టివల్‌కి సంబంధించిన మొదటి అడుగు సెప్టెంబర్ 22న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ప్రారంభమవుతుంది! మాస్ యుఫోరియాను కలిసి స్వాగతం పలుకుదాం.హైదరాబాద్‌లోని నోవాటెల్ HICCలో మీ అందరినీ కలుద్దాం!..

అతడు కూడా మిమ్మల్ని చూడటానికి ఆతృతగా ఉన్నాడు. మనం ప్రేమ వరదను మోసుకొద్దాం. సెప్టెంబర్ 22న కలుద్దాం" అనే క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లోని నోవాటెల్ జరగనున్న ఈ వేడుక కోసం ఫ్యాన్స్ ఏ లెవల్లో రానున్నారో చూడాలి.

ఇకపోతే దేవర మూవీ నుంచి ఇంకో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు రూమర్లు బయటికి వచ్చాయి. ఈ కొత్త ట్రైలర్ సినిమా రిలీజ్ కు ముందే తీసుకొస్తున్నట్లు సమాచారం. అంటే..దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.