జపాన్ లో రిలీజ్ కాబోతున్న దేవర.. ప్రమోషన్స్ షురూ చేసిన తారక్..

జపాన్ లో రిలీజ్ కాబోతున్న దేవర.. ప్రమోషన్స్ షురూ చేసిన తారక్..

టాలీవుడ్ సినిమాలకి గ్లోబల్ వైడ్ గా క్రేజ్ పెరుగుతోంది. దీంతో మేకర్స్ కూడా ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి జపాన్, జర్మనీ, అమెరికా, కెనడా వంటి దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు దాదాపుగా రూ.675 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. దీంతో దర్శక నిర్మాతలకి లాభాలపంట పండిందని చెప్పవచ్చు. అయితే ఈసినిమని మేకర్స్ జపాన్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. 

దీంతో ఎన్టీఆర్ ప్రమోషన్స్ లో శురూ చేశాడు. ఇందులోభాగంగా జపాన్ కి చెందిన పలు మీడియా సంస్థలతో ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ విషయానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఎన్టీఆర్ మీడియా సంస్థలతో మాట్లాడుతూ కనిపించాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ @Tarak9999 మార్చి 22న తన సందర్శనకు ముందు జపనీస్ మీడియా కోసం ఇంటర్వ్యూలతో దేవర ప్రమోషన్‌లను ప్రారంభించారు. మార్చి 28న జపాన్‌లో గ్రాండ్ విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది". అంటూ క్యాప్షన్ పెట్టారు. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ తెలుగులో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 లో కూడా మంచి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.