DevaraTickets: బుకింగ్స్లో దేవర దూకుడు.. 27 షోల టికెట్లు.. రెండే రెండు నిమిషాల్లో ఖతం

DevaraTickets: బుకింగ్స్లో దేవర దూకుడు.. 27 షోల టికెట్లు.. రెండే రెండు నిమిషాల్లో ఖతం

మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర (Devara). ఈ మూవీ సెప్టెంబర్ 27 శుక్రవారం రీలిజ్ కానుండగా.. సోమవారం (సెప్టెంబర్ 23) టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి.

ఇపుడు సోషల్ మీడియాలో, థియేటర్లో, ఓవర్సీస్ లో..ఇలా ప్రపంచమంతా దేవర ఫీవర్ పట్టుకుంది. ఇన్ని రోజులు దేవర మేకర్స్ ప్రమోషన్స్ చేశారు..ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర అడ్వాన్స్ బుకింగ్స్ తోని, ఎన్టీఆర్ కటౌట్స్ తోని, మాస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. 

ALSO READ | GameChanger: అధికారిక ప్రకటన వచ్చేసింది.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అనౌన్స్

ఇంకా దేవర తుఫాన్ ఎలా ఉందో.. మరొక్క ఉదాహరణ చెప్పుకోవాలంటే..ఇది చూడండి. దేవర టికెట్స్ ఇట్టే పెట్టారు..అట్టే అయిపోయాయి. రెండే రెండు నిమిషాల్లో ఏకంగా 27 షోల టికెట్లు అమ్ముడుపోయాయంటే నమ్మగలరా? ఎన్టీఆర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతలా వేచి చూస్తున్నారో ఇది చాలదా..అయితే..ఈ టికెట్స్ ఎక్కడ అమ్ముడుపోయాయంటే.. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas).  రెండే నిమిషాల్లో టికెట్లన్నీ అమ్ముడైపోవడం గమనార్హం..ఇది కదా ట్రెండ్..ఇదిగా దేవర ఫీవర్!

హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో దేవర ఫస్ట్ డే..మొత్తంగా 27 షోలు పడనున్నాయి. ఉదయం 7.55 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మొత్తంగా 27 షోలు ఆ థియేటర్ యాజమాన్యం వేస్తుండం విశేషం.

అయితే అక్కడ ఇన్నేసి షోలు ఉన్నా, అందులోను  టికెట్ల ధరలను భారీగా పెంచినా..దేవర కోసం.. అంటే ఎన్టీఆర్ కి ఉండే క్రేజీ తోను..కేవలం రెండే నిమిషాల్లో 27 షోల టికెట్లన్నీ అమ్ముడైపోయాయంటే ఎవరైనా నమ్మగలరా? కనీసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా ఊహించగలరా?

ఇదండీ..మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటే..దేవర మూవీకి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఇదొక్క ఉదాహరణతోనే తెలుగు ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. ప్రపంచ సినిమాకు అర్థమైపోతోంది. 

ధరలు ఎంత పెరిగాయంటే.. 

దేవర సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం (సెప్టెంబర్ 23) అనుమతులు ఇచ్చింది. అదనపు షోలకు ఓకే చెప్పింది. ఫస్ట్ డే సెప్టెంబర్ 27న దేవర సినిమా ఒక్కో టికెట్‍పై రూ.100 అదనంగా ధర పెంచేందుకు తెలంగాణ  సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత తొమ్మిది రోజులు.. 'సెప్టెంబరు 27 నుండి 9 రోజుల పాటు అనగా అక్టోబరు 5వరకు' ప్రతిరోజు తెలంగాణవ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‍పై రూ.50, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‍పై రూ.25 రేటును పెంచుకునేందుకు ఓకే చెప్పింది.

ALSO READ | Hero Karthi: నేనేమీ తప్పుగా మాట్లాడలేదు పవన్ సార్.. అయినా సారీ : హీరో కార్తీ

తెలంగాణవ్యాప్తంగా దేవర ఫస్ట్ షో ఉదయం 4 గంటల నుంచి ఆరు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రెండో రోజు నుంచి పదో రోజు వరకు.. ప్రతీ రోజు ఐదు షోలకు మాత్రమే ఓకే చెప్పింది. ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో అర్ధరాత్రి 1 గంట షోకు మాత్రం 29 థియేటర్లకే తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.

కాగా సింగిల్ స్క్రీన్ లో పెద్ద హీరోలకు ఉండే బాల్కనీ టికెట్ ధర రూ. 175- ఇప్పుడు దేవర సినిమాకి రూ. 295/-గా ఉంది. రూ.110 ల టికెట్ ధర - రూ.235 గా ఉంది. రూ.80 ల టికెట్ ధర  రూ.150 గా ఉంది. 

ఇకపోతే మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో నార్మల్ గా రూ.295/- ఇప్పుడు దేవర సినిమాకి రూ.410 గా ఉంది. రిక్లైనర్ హయ్యెస్ట్ రూ.475 గా ఉంది. 

అయితే.. మల్టీప్లెక్స్ లలో గరిష్ఠంగా రూ.413 నుంచి రూ.475 గా ఉంది. సింగిల్ స్క్రీన్లలో రూ.295 నుంచి 150 గా పరిమితి విధించారు. అయితే, ఫస్ట్ డే మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయి. ఇక రెండో రోజు నుంచి మల్టీప్లెక్స్ లలో గరిష్ఠంగా రూ.354, సింగిల్ స్క్రీన్లలో రూ.206 రేట్లు అమలు చేయనున్నారు.

  • Beta
Beta feature