ఫియర్..ఫియర్..ఫియర్..గత వారం నుంచి ఈ పదం ఎన్టీఆర్ ఫాన్స్ లో అలజడి పుట్టించింది.ఇక నిన్నటి (మే 19)నుంచి అదే ఎన్టీఆర్ ఫాన్స్ లో వణుకు పుట్టిస్తుంది. ఈ ఫియర్ సాంగ్ ప్రభావం అన్ని రకాల ఆడియాన్స్ కి సరిగా ఎక్కట్లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫియర్ సాంగ్ ట్రెండ్ అవుతున్నప్పటికీ..అదే లెవెల్లో నెటిజన్స్ నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.మరి ఎలాంటి విమర్శలు వస్తున్నాయో చూద్దాం.
ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగినట్లుగా లిరిక్స్ ఉన్నా కూడా..లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు కొంచెం అతిగా అనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్టులు చేస్తున్నారు. దూకె ధైర్యమ జాగ్రత్త, మృత్యువుకే ముచ్చెమట లాంటి పదాలు మించి ఉన్నాయి..చెప్పాలంటే అతిశయంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మరికొందరైతే లిరిక్స్ అసలు సరిగా వినిపించడం లేదన్న ఫిర్యాదులు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అనిరుద్ మ్యూజిక్ సౌండ్ పైకి హోరెత్తేలా ఉంది. కానీ, ఇటువంటి విమర్శలు ఎన్టీఆర్ సునామీకి ఎలాంటి అడ్డు రాదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరిగి పోస్టులు చేస్తున్నారు.
ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇవే:
అగ్గంటుకుంది సంద్రం.. దేవ..
భగ్గున మండె ఆకసం
అరాచకాలు భగ్నం.. దేవ..
చల్లారె చెడు సాహసం
జగడపు దారిలో
ముందడుగైన సేనాని
జడుపును నేర్పగా
అదుపున ఆపే సైన్యాన్ని
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటములాగెనే
ప్రాణం పరుగులయీ..
కలుగుల్లో దూరేలే..
దూకే ధైర్యమ జాగ్రత్త..
పోవే.. పో ఎటుకైనా..
దేవర ముంగిట నీవెంత..
పోవెందుకే.. దేవర..
జగతికి చేటు చేయనేల
దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ
కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యిందివేళ
విధికే ఎదురై వెళితే విల విలా
అలలయే ఎరుపు నీళ్లే..
ఆ కాళ్లను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా
దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే
మృత్యువుకైన ముచ్చెమట
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటములాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరేలే..
దూకే ధైర్యమ జాగ్రత్త..
పోవే.. పో ఎటుకైనా..
దేవర ముంగిట నీవెంత..
పోవెందుకే.. దేవర..
ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రీ (Ramajogaiah Sastry) లిరిక్స్ అందించగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వరపరచి పాడారు.దయ లేని దేవర మౌనం..సవరణ లేని హెచ్చరిక అంటూ ఈ సాంగ్ తో కొరటాల మార్క్ ని చూపించారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ సముద్రంలో బోట్ పై అలా వస్తుంటే రెండు కళ్ళు చాలవన్నట్లుగా స్టన్నింగ్ లుక్స్ అదిరిపోయాయి.
ప్రతి ఒక్కరిలో భయాన్ని రేపే దేవర..భారీ అలల మధ్య ఎత్తుగా నిలబడి..అతను కలిగించే భయమే అతని పాదాల క్రింద ఏదైనా ఆయుధంగా మారుతుందని విషయాన్నీ..చాలా చక్కగా ఈ సాంగ్ లోని ప్రతి పంక్తిని బ్లేడ్ లాగా రూపొందించారు గీత రచయిత రామ జోగయ్య శాస్త్రీ. అగ్గంటుకుంది సంద్రం..భగ్గున మండె ఆకసం వంటి పదాలే అందుకు ఉదాహరణ అని చెప్పొచ్చు.