దేవర కలెక్షన్లు.. రెండో రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..?

దేవర కలెక్షన్లు.. రెండో రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..?

తెలుగు ప్రముఖ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తారక్ మాస్ యాక్టింగ్ తో ఫ్యాన్స్ ని కట్టిపడేసాడు. దీంతో జిటివ్ టాక్ తో దేవర చిత్రం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే విడుదలైన మొదటిరోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.173 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. 

తాజాగా దేవర చిత్రం రెండో రోజు కలెక్షన్ల వివరాలు చిత్ర యూనిట్  తెలియజేశారు. ఈ క్రమంలో రెండోరోజు దాదాపుగా రూ.70 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజులకుగానూ రూ. 243 కోట్లు కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే అక్టోబర్ 3 నుంచి దసరా హాలిడేస్ ఉండటం అలాగే దసరా ముంగిట పెద్ద సినిమాలు లేకపోవటం వంటివాటి కారణంగా ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఏరియాల వారీగా రెండో రోజు కలెక్షన్ షేర్.

సెడెడ్ - రూ 14.17 కోట్లు
వైజాగ్ - రూ 7.15 కోట్లు
తూర్పు – రూ 4.88 కోట్లు
వెస్ట్ - రూ 4.08 కోట్లు
కృష్ణ - రూ 3.97 కోట్లు
గుంటూరు - రూ 7.09 కోట్లు
నెల్లూరు - రూ 2.73 కోట్లు

మొత్తం ఏపీ మరియు సీడెడ్ షేర్ – రూ. 44.07 కోట్లు