DevaraGlimpse: రక్తంతో నిండిపోయిన దేవర ఎర్ర సముద్రం

జూనియర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ దేవర (Devara). ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో నందమూరి ఫ్యాన్స్  వేయికళ్లతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

అంతే కాదండోయ్..దేవర గ్లింప్స్ జనవరి 8న రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ కళ్ళలో ఎదురుచూపు ఎక్కువైపోయింది. ఇక ఎన్టీఆర్ ఆగమనం..దేవర గ్లింప్స్ వచ్చేసింది. ఇక దేవర దర్శనం చూసేయండి. 

సముద్రం రక్తంతో నిండిపోయింది..ఇప్పుడు అతని ఎర్ర సముద్రం! ఈ సముద్రం చేపల్నికంటే..కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువగా చూసుండాది..అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు..అనే ఎన్టీఆర్ డైలాగ్ ఆసక్తిగా ఉంది. ఈ గ్లింప్స్ ఫుల్ యాక్షన్‍తో నిండిపోయింది.

ఈ గ్లింప్స్ నిడివి చూసుకుంటే..1 నిమిషం 19 సెకన్ల పాటు ఉన్న ఈ గ్లింప్స్ లో..ఎన్టీఆర్ యాక్షన్ మోడ్‍ దర్శనంతో ఫ్యాన్స్ కు పూనకాలు వస్తోన్నాయి. అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్సులు..డైలాగ్స్ అదిరిపోయాయి. రాక్షసులకు భయం దగ్గరగా చూపిస్తోన్న దేవరతో..ఎన్టీఆర్ మరో మెట్టు ఎక్కబోతున్నట్లు కనిపిస్తోంది! వీఎఫ్‍ఎక్స్ అత్యున్నత ప్రామాణాలతో ఉండేలా తెరకెక్కించిన దేవరతో ఎన్టీఆర్ మరో హిట్ కొట్టడం కన్ఫమ్. 

స్టార్ డైరెక్టర్ కొరటాల తెరకెక్కిస్తున్న దేవరలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‍గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్‍ చాకో, నరైన్, కలైరాసన్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే దేవర పార్ట్-1కు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తయింది. యువసుధ క్రియేషన్స్(Yuvasuda creations) అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్(Ntr arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. దేవర సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.