2 వారాల్లో రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన దేవర..

 2 వారాల్లో రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన దేవర..

టాలీవుడ్ ప్రముఖ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించగా బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా శృతి మరాఠీ, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, అభిమన్యు సింగ్, అజయ్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాసెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఈ క్రమంలో రిలీజ్ అయిన మొదటి రోజునుంచే మంచి పాజిటివ్ టాక్ తో భారీ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. 

ఇటీవలే దేవర చిత్ర యూనిట్ రెండు వారాల కలెక్షన్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇందులోభాగంగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసినట్లు అధికారికంగా తెలిపారు. అంతేగాకుండా ఈ విషయానికి సంబంధించిన వీడియొని కూడా షేర్ చేశారు.

 
అయితే మొదటివారంలో దూకుడుగా కలెక్షన్లు ప్రారంచినా రెండో వారంలో కొంతమేర కలెక్షన్లు తగ్గాయి. ఇప్పటికే దసరా సెలవులు కూడా అయిపోవడంతో ఈ కలెక్షన్లు మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమా షూటింగులకి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో సమయం గడుపుతున్నాడు.