Ntr Devara Part 1: చుక్కలు చూపిస్తున్న దేవర లెక్కలు.. ప్రీ రిలీజ్ బిజినెస్తోనే సరికొత్త రికార్డ్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్టు తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవరపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన దేవర టీజర్ కూడా ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇక రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ అక్టోబర్ 10న ప్రేక్షకుల  ముందుకు రానుంది. 

అయితే.. దేవర సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కనీ.. వినీ ఎరుగని రేంజ్ లో జరుగుతుందట. కేవలం తెలుగు స్టేట్స్ లోనే దాదాపు రూ.130 కోట్ల బిజినెస్ జరుగుతుందట దేవర సినిమాపై. ఇక మిగతా భాషల్లో కలిపి రూ.50 నుండి 60 కోట్ల బిజినెస్ చేస్తుండగా.. ఓవర్ సీస్ రైట్స్ రూ.27 కోట్లు, ఆడియో రైట్స్ రూ. 33 కోట్లు, ఓటీటీ రైట్స్  రూ.155 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. ఇలా రిలీజ్ కు ముందే అన్ని లెక్కలు కలుపుకొని దాదాపు  రూ.400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

ఇక సాంగ్స్, టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ అవకుండానే ఈ రేంజ్ బిజినెస్ అంటే మాములు విషయం కాదని అనుకుంటున్నారు ట్రేడ్ వర్గాలుల్. ప్రస్తుతం ఈ సినిమాకున్న బజ్ కి రిలీజ్ తరువాత ఈ సినిమా రూ.1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అనుకుంటున్నారు. ఈ న్యూస్ తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇండస్ట్రీలో లెక్కలో సెట్ చేయాలంటే అది కేవలం ఎన్టీఆర్ వల్లే అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రేంజ్ అంచనాల మధ్య వస్తున్న దేవర మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

  • Beta
Beta feature