యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- స్టార్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva) కాంబినేషన్‌లో దేవర మూవీ వస్తోన్నవిషయం తెలిసిందే. ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్గా ఈ మూవీలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని కొరటాల స్టార్ట్ చేశాడని సమాచారం. ఈ ఫైట్ మొత్తం సముద్రంలోనే ఉంటుందట..అందుకు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఖర్చు విషయంలో వెనుకాడటం లేదని టాక్.
ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం యాక్షన్ కొరియోగ్రఫర్ కింగ్ సోలొమన్ అద్భుతంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ వాటర్ ఫైట్ దేవర మూవీకే హైలెట్గా ఉండబోతుందని యూనిట్ వర్గాల సమాచారం. ఇక తారక్ నుంచి మరోసారి భీకరమైన విశ్వ రూపం చూడబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇప్పటికే యాక్షన్ షురూ చేసిన దేవర టీం నాన్ స్టాప్గా 20 రోజుల పాటు ఈ వాటర్ ఫైట్ని తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం తారక్ 5 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ప్రసెంట్ దేవర నుంచి వినిపిస్తోన్న ఈ వాటర్ ఫైట్ టాక్..ఎన్టీఆర్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తుంది.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం..షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎక్కువగా యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడం, యాక్షన్ సీన్స్‌లో విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండడంతో ముందుగా వాటిని పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక రీసెంట్ రిలీజ్ డేట్ ని రిలీజ్ చేసిన వీడియోలో కొరటాల మాట్లాడుతూ..‘ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాలు ఉంటాయి. వాళ్లకు దేవుడు, చావు అంటే భయం లేదు. ఒకే ఒక్కటంటే భయం. ఆ భయం ఉండాలి.. అవసరం’ అంటూ ‘దేవర’ పాత్రపై హైప్ పెంచారు. దేవర సినిమాని యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా APR 5న 2024 లో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.
250 days to witness fear unleash on the big screen ??
— Devara (@DevaraMovie) July 30, 2023
Vastunna….#Devara from 5th April 2024. pic.twitter.com/CCaARI8Fwm