NTR Fan Died: దేవర సినిమా చూస్తూ కేకలు వేస్తూ.. కుప్పకూలి అభిమాని మృతి..

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన దేవర విడుదల సందర్భంగా అభిమానులు ఓ వైపు ఎంజాయ్ చేస్తుంటే.. మరో వైపు విషాదం చోటు చేసుకుంది. కడపలోని అప్సర థియేటర్‌లో అభిమానుల కోసం థియేటర్ యాజమాన్యం ఫ్యాన్స్ షో వేశారు.. ఇక, ఈ సినిమా చూస్తున్న క్రమంలో అభిమానులు రెచ్చిపోయారు.

ఎన్టీఆర్‌ ఎంట్రీ.. ఫైట్స్‌, డైలాగ్స్‌.. ఇలా ప్రతీ సీన్‌కి అరుపులు, కేకలతో థియేటర్స్ లో హోరెత్తించారు. అయితే ఈ స్పెషల్ షోకు వచ్చిన 'మస్తాన్' అనే ఎన్టీఆర్ అభిమాని ..మూవీ చూస్తూ ఊహించని విధంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మస్తాన్ వలీ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువికరించారు. అతని మృతికి గుండెపోటే కారణమని భావిస్తున్నారు 

మృతుడు సీకే దీన్నే మండలం జమాల్‌పల్లికి చెందిన మస్తాన్ వలీగా గుర్తించారు పోలీసులు. మస్తాన్‌ వలీ.. ఎన్టీఆర్‌కి పెద్ద ఫ్యాన్‌ అనీ.. కానీ, సినిమా చూస్తూ ఇలా ప్రాణాలు విడవడం ప్రతిఒక్కరికి బాధ కలిగిస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియాల్సి ఉంది. అయితే, ఏదేమైనా థియేటర్లో హై రేంజ్ మ్యూజిక్ ఉంటుంది కాబట్టి.. గుండె ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు సినిమా చూడకపోతేనే బాగుంటుందని పలువురు సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.