కౌశిక్ హాస్పిటల్ బిల్స్ క్లియర్ చేసిన అభిమాని...తారక్ కాంట్రవర్సీ కి చెక్..

కౌశిక్ హాస్పిటల్ బిల్స్ క్లియర్ చేసిన అభిమాని...తారక్ కాంట్రవర్సీ కి చెక్..

దేవర సినిమా విడుదల సమయంలో క్యాన్సర్ తో బాధపడుతున్న తన వీరాభిమాని కౌశిక్ కు సాయం చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చి సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ మమ్మల్ని పట్టించుకలేదని కౌశిక్ తల్లి సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

దీంతో ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు కౌశిక్ ట్రీట్మెంట్ పొందుతున్న హాస్పిటల్ కి వెళ్లి బిల్స్ క్లియర్ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ విషయానికి సంబందించి అభిమాని ఏకంగా హాస్పిటల్ బిల్స్ క్లియర్ చేసిన బిల్ కాపీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "కౌశిక్ ఇప్పుడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. కౌశిక్ తల్లిని ఉపయోగించి తారక్ విషయంలో కాంట్రవర్సీలు క్రియేట్ చేసేందుకు ట్రై చేసినవారు ఇక విశ్రాంతి తీసుకోండి అంటూ ట్వీట్ చేశాడు". దీంతో తారక్ అభిమానులు గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read :- ఈ టైమ్ లో ఇది అవసరమా భయ్యా

ఈ విషయం ఇలా ఉండగా కౌశిక్ తల్లి సరస్వతి తమ కుమారుడు క్యాన్సర్ తో బాధ పడుతున్న సమయంలో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడుతూ ట్రీట్మెంట్ కి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తామని చెప్పాడని తెలిపింది. కానీ దేవర సినిమా తర్వాత తారక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతే సోమవారం సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తమకి సహాయం చెయ్యాలని కోరింది.

ప్రస్తుతం కౌశిక్ కు చెన్నైలో అపోలో చికిత్స పూర్తయిందని.. ప్రభుత్వం రూ.11 లక్షలు, టీటీడీ నుండి రూ.40 లక్షలు ఆర్థిక సాయం అందిందని తెలిపింది సరస్వతి.ఇంకా రూ. 20 లక్షలు కట్టాలని ఆసుపత్రి వారు అడుగుతున్నారని..జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు తమకు పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.