దేవర షో క్యాన్సిల్ చేశారని థియేటర్ని ధ్వంసం చేసిన అభిమానులు..

ఈరోజు (సెప్టెంబర్ 27) ప్రముఖ హీరో ఎన్టీఆర్ మరియు డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. దీంతో ఉదయం 1 గంటకే థియేటర్ల వద్ద హంగామా మొదలైంది. అయితే పలుచోట్ల కొన్ని అనుకోని కారణాలవల్ల బెనిఫిట్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో అభిమానులు నిరాశకి గురయ్యారు.  

అయితే ఖమ్మం కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో సాంకేతిక లోపాల కారణంగా మధ్యాహ్నం షో ని నిలిపివేశారు. దీంతో ఎన్టీఆర్  అభిమానులు తీవ్ర ఆగ్రహం చెందారు. ఈ క్రమంలో థియేటర్ లోని ఫర్నిచర్ అలాగే అద్దాలు పగలగొట్టడం వంటివి చేశారు. దీంతో ఇది గమనించిన కొందరు స్థానికులు ఈ సంఘటనని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే కాకుండా పలు చోట్ల ఎన్టీఆర్ కటౌట్లు తగలబెట్టడం, గొడవలు పడటం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ALSO READ | NTR Fan Died: దేవర సినిమా చూస్తూ కేకలు వేస్తూ.. కుప్పకూలి అభిమాని మృతి..

ఈ విషయం ఇలా ఉండగా భారీ అంచనాల నడుమ విడుదలైన దేవర చిత్రం ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఓవర్సీస్ మరియు తెలుగు రాష్ట్రాల్లో పలు రికార్డులు క్రియేట్ చేసింది. కానీ హిందీ, తమిళ్ భాషలలో మాత్రం ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేనట్లు సమాచారం.