యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాని కబ్జా చేసేసారు. ఎక్కడ చూసినా ఒకటే పేరు ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఈ హంగామా చూసిన మిగతా హీరోల ఫ్యాన్స్ ఈ క్రేజ్ ఏంటి సామీ అని అవాక్కవుతున్నారు. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ హాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫోటోస్, వీడియోస్ ఇలా ఎదో ఒకటి ట్రెండ్ చేస్తూ మే నెల మొత్తం సోషల్ మీడియాని కబ్జా చేసేసారు.
ఈ రచ్చని రెట్టింపు చేస్తూ.. సింహాద్రి సినిమాని రీరిలీజ్ ను కూడా ప్లాన్ చేశారు. ఇక ఇప్పటివరకూ ఏ రీరిలీజ్ మెయింటైన్ చెయ్యనంత హైప్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ నుంచి వచ్చిన ఈ మూవీ మాస్ ఫీస్ట్ ని మళ్లీ థియేటర్ లో ఎంజాయ్ చెయ్యడానికి ఫాన్స్ రెడీ అయ్యారు. కేవలం ఓవర్సీస్ లోనే 100 స్క్రీన్ లో సింహాద్రి రీరిలీజ్ అవుతుంది అంటే.. క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
సింహాద్రి రీరిలీజ్ కి ఇంకా వారం సమయం ఉంది. కానీ.. ఈలోపే బుకింగ్స్ ఓపెన్ అవ్వడం, కంప్లీట్ అవ్వడం కూడా జరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సింహాద్రి రీరిలీజ్ కోసం ఏర్పాటు చేసిన ఆరు షోస్ ఇప్పటికే హౌజ్ ఫుల్స్ అయిపోయాయి. దీంతో.. ఈ సినిమా రీరిలీజ్ కలెక్షన్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అని ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. మరి ఎన్టీఆర్ ఫాన్స్ క్రియేట్ చెయ్యబోయే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలంటే మే 20 వరకు ఆగాల్సిందే.