
టాలీవుడ్ యంగ్ హీరోల నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కలసి నటించిన "మ్యాడ్ స్క్వేర్" సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో ఘనంగా చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా వచ్చారు.
ఈ సందర్భంగా హీరో తారక్ మాట్లాడుతూ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే కామెడీ జోనర్ సినిమాల్లో నటించడం అంత సులభం కాదని సీనియర్ హాస్యనటులు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తర్వాత తనకి ఇష్టమైన కమెడియన్ సినీల్ అని చెప్పుకొచ్చాడు.
►ALSO READ | Peddi Movie Release Date: శ్రీరామనవమికి చరణ్ ఫ్యాన్స్ కి గ్రాండ్ ట్రీట్ ఇవ్వనున్న బుచ్చిబాబు..
అలాగే ఈ సినిమాతో సునీల్ మళ్ళీ కామెడీ కి కంబ్యాక్ ఇచ్చాడని ప్రశంసించాడు. అయితే తనకి కామెడీ జోనర్ సినిమాలు అంటే భయమని అందుకే అదుర్స్ సీక్వెల్ జోలికి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక ప్రొడ్యూసర్ నాగవంశీ గురించి కూడా మాట్లాడుతూ వంశీ మాట కరుకుగా ఉన్నప్పటికీ మనసు చాలా మంచిదని సినిమాలంటే ఫ్యాషన్ తో ఉంటాడని అందుకే మంచి సక్సెస్ ని అందుకుంటున్నాడని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది తారక్ దేవర సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం హిందీలో 'వార్ 2' సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. వార్ 2 సినిమా ఆగస్టు 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.