NTR: బామ్మర్ది కోసం బావ వస్తున్నాడా.. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా తారక్..

NTR:  బామ్మర్ది కోసం బావ వస్తున్నాడా..  మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా తారక్..

NTR: టాలీవుడ్ యంగ్ హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ తదితరులు కలసి నటించిన కామెడీ ఎంటర్టైనర్ "మ్యాడ్ స్క్వేర్" బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించాడు. అయితే రిలీజ్ రోజే రూ.20 కోట్లు (గ్రాస్) పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే అదే రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది.

దీంతో మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సక్సెస్ మీట్ రేపు (శుక్రవారం ఏప్రిల్ 4) హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సక్సెస్ మీట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

అయితే గతంలో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకి మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ చేయలేకపోయారు.. దీంతో ఫ్యాన్స్ కి తారక్ కి మధ్య కొంతమేర దూరం పెరిగింది. అయితే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఫ్యాన్స్ కి అనుమతి ఉంటుందో లేదో అనే సందేహాలు ఉన్నాయి. అలాగే మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ జరిగే లొకేషన్ కూడా ఎక్కడనేది ఇంకా తెలియాల్సి ఉంది.