ఇటీవలే తెలుగులో ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం విడుదలయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించగా జాన్వి కపూర్, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, అభిమన్యు సింగ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అయితే ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజు కొంతమేర నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం బాగానే సాధించింది. దీంతో ప్రొడ్యూసర్లు సేఫ్ అయ్యారని చెప్పవచ్చు.
ఎన్టీఆర్ దేవర చిత్రం నెగటివ్ టాక్ పై స్పందించాడు. ఈ క్రమంలో కొందరు సినిమా ని చూడకుండా, సినిమా గురించి తెలియకుండానే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారని, కానీ సినిమాని సినిమాలా చూస్తే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. అలాగే సినిమా చూడని వాళ్ళని కాకుండా సినిమా చూసినవాళ్ళని అడిగితే కరెక్ట్ రివ్యూ ఇస్తారని దేవర విషయంలో కూడా అదే జరిగిందని ఈ క్రమంలో మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్లు వచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ విషయం ఇలా ఉండగా దేవర చిత్రం మొదటి వారం కలెక్షన్లు చూస్తే దాదాపుగా రూ.405 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.