దివంగత ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం రూ.100 స్మారక నాణేంను ఇవాళ(ఆగస్టు 28) విడుదల చేయనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతల మీదుగా ఈ నాణెం విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు లతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా పాలోననున్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవిత విశేషాలతో కూడిన 20 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించనున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేయనున్నారు.
ఇక ఈ నాణెం విషయానికి వస్తే.. ఈ నాణెంపై మార్చి 20న గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నాణెం 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో.. 50% వెండి, 40% రాగి, 5% జింక్ 5% నికెల్‌తో రూపొందించబడింది.