భాషలు వేరు.. కానీ మనమంతా ఒక్కటే: ఎన్టీఆర్

భాషలు వేరు.. కానీ మనమంతా ఒక్కటే: ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తెలుగులో దేవర చిత్రం;లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసందే. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా  బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. 

కాగా ఈ దేవర 1 చిత్రం తెలుగు, తమిళ్, హిందీ తదితర భాషాల్లో సెప్టెంబర్ 27వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది. 

దీంతో దేవర చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులోభాగంగా ఇటీవలే ఎన్టీఆర్, జాన్వీ క్కాపూర్ చెన్నైలో నిర్వహించిన ప్రమోషన్స్ ఈవెంట్ లో పాల్గొన్నారు. 

ALSO READ | JrNTR: బాక్సులు బ్లాస్ట్ చేసే 'ఆయుధపూజ' పాట ముహూర్తం ఖరారు..టైం ఇదే

ఈ క్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ మనం తెలుగు, తమిళం, మలయాళం వివిధ భాషలు మాట్లాడుతున్నప్పటికీ కేవలం భాషా పరంగా విభజించబడ్డాం అంతేతప్ప సినిమాల పరంగా మనమంతా ఒక్కటేనని అభిప్రాయపడ్డారు. 

అలాగే చెన్నైతో సంబంధం లేకుండా ఏ సినిమా ప్రమోషన్స్‌ కూడా ఉండవని కూడా తెలిపాడు. ఇక దేవర సినిమాని తమిళ్ లో విడుదల చేస్తున్నందుకు తనకి ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.