సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకులముందుకు వచ్చింది. కాగా ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించగా సైఫ్ అలీ ఖాన్, అభిమన్యు సింగ్, జాన్వీ కపూర్, శ్రీకాంత్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే దేవర చిత్రం అభిమానుల అంచనాలను ఏమాత్రం మిస్ అవ్వకుండా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన మొదటివారంలోనే దాదాపుగా రూ.405 కోట్లు (గ్రాస్) వసూళ్లు సాధించింది.
ALSO READ | దేవర మొదటివారం కలెక్షన్లు ఎంతంటే..?
ఇటీవలే చిత్ర యూనిట్ సక్సస్ పార్టీ నిర్వహించింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి స్పెషల్ థాంక్స్ తెలిపాడు. అలాగే దేవర చిత్రం ఇంత పెద్ద హిట్ అవ్వడానికి అనిరుద్ అందించిన బీజీఎం మరియు పాటలు కూడా కారణమని ప్రశంసించాడు. అలాగే దేవర చిత్రం గ్లింప్స్ మరియు ట్రైలర్ నుంచే మంచి హైప్ క్రియేట్ అయ్యిందని, మొదటి నుంచి దేవర పెద్ద హిట్ అవుతుందని అనిరుద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దసరా సెలవులు ఉండటంతో దేవర మూవీ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ వారాంతానికి దాదాపుగా రూ.500 కోట్లు(గ్రాస్) వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.