టాలీవుడ్ ప్రముఖ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించగా బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా శృతి మరాఠీ, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, అభిమన్యు సింగ్, అజయ్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాసెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఈ క్రమంలో రిలీజ్ అయిన మొదటి రోజునుంచే మంచి పాజిటివ్ టాక్ తో భారీ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది.
ALSO READ | రీ-రిలీజ్ కాబోతున్న ప్రేమ కావాలి సినిమా..
అయితే దేవర చిత్రం ఇంత పెద్ద హిట్ అయినందకు ఫ్యాన్స్ మరియు చిత్ర యూనిట్ కి ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలియజేశాడు. ఇందులోబాగంగా ఎన్టీఆర్ తన అధికారిక సోషల్ మీడియాలో దేవర చిత్రానికి పనిచేసిన క్యాస్ట్ & క్రూ, డిష్ట్రిబ్యూటర్స్, థియేటర్ల యాజమాన్యం తదితరులను మెన్షన్ చేస్తూ నోట్ ని షేర్ చేశాడు. దీంతో తారక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా దేవర చిత్ర యూనిట్ రెండు వారాల కలెక్షన్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసినట్లు అధికారికంగా తెలిపారు. అంతేగాకుండా ఈ విషయానికి సంబంధించిన వీడియొని కూడా షేర్ చేశారు.
Grateful. pic.twitter.com/YDfLplET7S
— Jr NTR (@tarak9999) October 15, 2024