తలసేమియా బాధితుల కోసం యుఫోరియా మ్యూజికల్ నైట్

తలసేమియా బాధితుల కోసం యుఫోరియా మ్యూజికల్ నైట్
  • ఎన్టీఆర్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో వచ్చే నెల 15న విజయవాడలో..
  • ఆ తర్వాత హైదరాబాద్, రాజమండ్రిలో షోలు

జూబ్లీహిల్స్, వెలుగు :  తలసేమియా బాధితులకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. తలసేమియాపై అవగాహన కల్పించేందుకు వచ్చే నెల 15న విజయవాడ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్​ స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్​టీమ్​తో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను జూబ్లీహిల్స్​లోని ఆఫీసులో ఎన్టీఆర్ ట్రస్ట్​మేనేజింగ్​ట్రస్టీ నారా భువనేశ్వరి మంగళవారం వెల్లడించారు.

యుఫోరియా మ్యూజికల్​నైట్ ద్వారా వచ్చే ప్రతి రూపాయిని తలసేమియా బాధితుల ట్రీట్​మెంట్​కు వినియోగించనున్నట్లు తెలిపారు. ట్రీట్​మెంట్​కోసం తలసేమియా బాధితులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారి సహాయార్థం ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు చెప్పారు. మ్యూజికల్ నైట్​లో అన్ని సాంగ్స్​పాడతారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్​కల్యాణ్​ను ఆహ్వానిస్తామని, వారు కూడా టికెట్​కొనుక్కునే ఈవెంట్​లో పాల్గొంటారని తెలిపారు. విజయవాడ తర్వాత హైదరాబాద్, రాజమండ్రిలోనూ మ్యూజికల్​షోలు నిర్వహిస్తామన్నారు.