బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఎన్టీఆర్

 బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఎన్టీఆర్

గతేడాది ‘దేవర’తో బ్లాక్ బస్టర్ హిట్‌‌ను  ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్  తన అభిమానుల  కోసం మరింత వేగం పెంచాడు. ‘ఆర్ఆర్ఆర్’ కోసం దాదాపు మూడేళ్ల సమయం తీసుకోవడంతో ఈసారి అలాంటి గ్యాప్ రాకుండా చూసుకుంటున్నాడు.  ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే హిందీలో హృతిక్ రోషన్‌‌తో కలిసి ‘వార్‌‌‌‌2’ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదలవుతోంది. 

అలాగే రీసెంట్‌‌గా ప్రశాంత్ నీల్‌‌తో ‘డ్రాగన్’ మూవీ స్టార్ట్ చేశాడు. వచ్చే సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉండేలా ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొరటాల శివతో ‘దేవర2’ చిత్రాన్ని జూన్, జులై నెలలో సెట్స్‌‌కు తీసుకెళ్లేలా సన్నాహాలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఎన్టీఆర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి కమిట్ అయ్యాడట. ఇప్పటికే కథ విన్నాడని, అది బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా ఈ ఏడాదిలోనే మొదలుపెట్టాలనుకుంటున్నాడట తారక్.  దీంతో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో అటు అభిమానులకు ఇటు ప్రేక్షకులకు వరుస ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలా సూపర్ స్పీడ్‌‌తో ఎన్టీఆర్ సినిమాలు చేయడం ఫ్యాన్స్‌‌కు ఆనందాన్ని ఇస్తోంది.