క్యాన్సర్ తో బాధ పడుతున్న ఫ్యాన్ కి వీడియో కాల్ చేసి మాట్లాడిన తారక్..

క్యాన్సర్ తో బాధ పడుతున్న ఫ్యాన్ కి వీడియో కాల్ చేసి మాట్లాడిన తారక్..

కొందరు సినీ హీరోలపై అమితమైన అభిమానం కలిగి ఉంటారు. ఈ క్రమంలో హీరోలు కూడా తమ అభిమానులకు ఏదైనా సమస్య వచ్చినా, సహాయం అవసరమయినా స్పందిస్తుంటారు. కాగా గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కౌశిక్ అనే యవకుడు ఎముక క్యాన్సర్ బాధ పడుతూ తాను ఎక్కువ రోజులు బ్రతకనని అలాగే తాను చనిపోయేలోపు తన అభిమాన హీరో ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని చుడాలని చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. 

దీంతో తన అభిమాని గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ ఈరోజు స్వయంగా తానే తన అభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పాడు. ఇందులో భాగంగా తొందర్లోనే క్యాన్సర్ భారినుంచి కోలుకోవాలని తనతో పాటూ తన ఫ్యాన్స్ కూడా అండగా ఉంటామని ధైర్యం చెప్పాడు. అలాగే తొందర్లోనే తనని కలుస్తానని అంతవరకూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. దీంతో ఎన్టీఆర్ చేసిన ఈ పనికి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ | దేవరకు అరుదైన ఘనత

ఈ విషయం ఇలా ఉండగా దేవర చిత్రం సెప్టెంబర్ 27వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఇటీవలే  దేవర చిత్ర ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.  అలాగే ఓవర్సీస్ లోని యూఎస్ లో అడ్వాన్స్ ప్రీ బుకింగ్ టికెట్లు విడుదల చెయ్యగా దాదాపుగా హౌజ్ ఫుల్  అయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల విడుదల ఎప్పుడెప్పుడా అని తారక్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.