ఎన్టీఆర్ నీల్ సినిమా క్రేజీఅప్డేట్.. ఏంటీ ఈ అరాచకం.. కాలిపోయిన కార్లతో ఫస్ట్ డే షూటింగ్..

ఎన్టీఆర్ నీల్ సినిమా క్రేజీఅప్డేట్.. ఏంటీ ఈ అరాచకం.. కాలిపోయిన కార్లతో ఫస్ట్ డే షూటింగ్..

కేజీఎఫ్ మూవీ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ  సినిమాని తెలుగు ప్రముఖ సినీ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలై రెండేళ్లు కావస్తున్నప్పటికీ ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదు. అయితే ఇటీవలే ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజే కావడంతో ఫ్రీ అయ్యాడు. దీంతో ప్రశాంత్ నీల్ సినిమా కోసం పూర్తి స్థాయిలో టైం కేటాయిస్తున్నాడు. 

అయితే నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాద్ లో మొదలైంది. ఇందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో కొన్ని యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కించారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సెట్స్ లో ఉన్న ఫోటోలని మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ప్రశాంత్ నీల్ మైక్ పట్టుకుని కార్ పై నిలబడి ఉన్నాడు. అలాగే మంటల్లో తగలబడిపోతున్న అంబాజిడర్ కారుని చుపియించారు. ఈ ఫొటోతోపాటూ #NTRNeel షూటింగ్ అధికారికంగా ప్రారంభమైందని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపారు. దీంతో తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ ఎడాది చివరికి ప్రశాంత్ నీల్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దీంతో వచ్చే ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది రిలీజ్ అయిన తారక్ సినిమా దేవర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. దేవర  సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపుగా రూ.675 కోట్లు కలెక్షన్స్ సాధించింది. దీంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ గతంలో తీసిన కేజీఎఫ్, సలార్  సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో ఈసారి ఎన్టీఆర్ తో రూ. వెయ్యికోట్లు కొల్లగొడతాడని తారక్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.