బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ చేసిన బోల్డ్ ఫొటోషూట్ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశపై ఆయనపై కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా ఆయన ముంబయిలోని చెంబూరు పోలీసుల ముందు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసుల ప్రశ్నలకు... రణ్ వీర్ సింగ్ సమాధానమిచ్చారు. తన న్యూడ్ ఫొటోషూట్ పై వాంగ్మూలాన్ని రాతపూర్వకంగా సమర్పించారు. ఇంకేమైనా వివరాలు కావాలంటే మళ్లీ తనను సంప్రదించవచ్చని రణ్ వీర్ ఈ సమయంలో చెప్పినట్టు సమాచారం. రణ్ వీర్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది.
రణ్ వీర్ సింగ్ చేసిన ఫొటోషూట్ పై ఇప్పటికే నెటిజన్లు, ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఇది మహిళల మనోభావాలకు భంగం కలిగించేలా ఉందంటూ గత కొన్ని రోజుల క్రితం ముంబయిలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన తమ ముందు హాజరు కావాలంటూ పోలీసులు సమన్లు జారి చేశారు. ఆగస్టు 22న హాజరు కావాలని పోలీసులు చెప్పగా... రణ్ వీర్ తనకు కొంత సమయం కావాలని అడిగాడు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనకు ఆగస్టు 30వరకు సమయం ఇచ్చారు.