చికాగోలో కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఖమ్మం విద్యార్థి నూకారపు సాయి తేజ చనిపోయాడు. చికాగోలోని ఎన్ -ఫేర్వెల్ ఈవ్ లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పల్లో నూకారపు సాయి తేజ మరణించాడు. సాయి తేజ 4 నెలల క్రితమే ఎమ్మెస్సీ చదవడానికి అమెరికా వెళ్లాడు. చదువుకుంటూ చికాగోలోని ఓ సూపర్ మార్కెట్ లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. కన్న కొడుకు చావు వార్త విన్న తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు విద్యార్థి మృదేహాన్ని అంత్యక్రియల కోసం ఇండియా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.