నుమాయిష్.. వీకెండ్​ రష్

నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్ ఆదివారం సందర్శకులతో కిక్కిరిసింది. వీకెండ్ ​కావడంతో నుమాయిష్​కు నగరవాసులు పోటెత్తారు. పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. గాంధీభవన్ ​మెట్రో స్టేషన్​ నుంచే రద్దీ కనిపించింది. డ్రెస్సులు, ఇండ్లలోకి కావాల్సిన వస్తువులు, డ్రైఫ్రూట్స్, ఫ్యాషన్ జ్యువెలరీ, డెకరేషన్ ఐటమ్స్ ఇలా ప్రతి స్టాల్​ వద్ద తాకిడి కనిపించింది.

ఫుడ్ జోన్ వద్ద ఎటు చూసినా జనమే ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలు ముందు నుంచే సందర్శకులు వచ్చారని స్టాళ్ల నిర్వాహకులు తెలిపారు. గేమ్ జోన్​వద్ద పిల్లలు, తల్లిదండ్రులతో కోలాహలంగా మారింది. ఆదివారం ఒక్కరోజే దాదాపుగా 52 వేల మంది సందర్శకులు వచ్చారని ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు తెలిపారు. శనివారం 46 వేలమంది సందర్శించినట్లు చెప్పారు. నుమాయిష్ ​ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. –వెలుగు, హైదరాబాద్