![ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్](https://static.v6velugu.com/uploads/2025/02/numaish-exhibition-closing-on-february-17th_yEl3mNV2D8.jpg)
- పర్మిషన్ ఇచ్చిన సిటీ సీపీ సీవీ ఆనంద్
బషీర్ బాగ్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కొనసాగుతున్న నుమాయిష్‌ను రెండు రోజులు పొడిగించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 15తో ఎగ్జిబిషన్ ముగుస్తుంది. ఎగ్జిబిషన్సొసైటీ అధికారులు మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ను కలిసి మరో రెండు రోజులు పొడిగించాలని రిక్వెస్ట్చేశారు. అందుకు సీపీ ఓకే చెప్పారు. దీంతో నుమాయిష్ ఈ నెల 17 వరకు కొనసాగుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రెటరీ సురేందర్ రెడ్డి వెల్లడించారు. సందర్శకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.