పిల్లల కోసం అడ్వెంచర్ గేమ్స్..పెద్దల కోసం బారులు తీరిన స్టాల్స్..వృద్ధుల కోసం జాయ్ రైడ్. అందరి కోసం..నోరూరించే ఫుడ్ స్టాల్స్, నగర జనం తప్పక చూసే జాతర 'సుమాయిష్'. షాపింగ్, ఈటింగ్, ఔటింగ్ అనే మూడు పదాలకూ ఒకే అర్ధం సుమాయిష్.
అది పేరుకే పారిశ్రామిక ప్రదర్శన. జమానాలోనే గంగాజమునా తెహజీబ్లోలో భాగమైపోయింది. 'దసరా సెలవులకు అమ్మమ్మ ఊరికి పోవాలె.. సంక్రాంతి సెలవులకు సుమాయిష్లో ఖుషీగా తిరగాలె' అనుకుంటారు పట్నం పిల్లలు.
సుమాయిష్ ఎప్పుడనే ప్రశ్నే లేకుండా క్యాలెండర్ మారిందంటే నుమాయిష్ పండుగ వచ్చినట్లే అనుకుంటారు బస్తీలో, జనవరి ఒకటిన ప్రారంభమైన నుమాయిష్ 45 రోజులపాటు ఉంటుంది.
'చుట్టాలు సంక్రాంతికి రమ్మని. పిలిచినా...మీరేమా ఇంటికి రండి. సుమాయిష్ పండుగ చేసుకుందాం' అని రారమ్మని ఎదురు పిలుస్తారు పట్నపోళ్ళు. పట్నంలో పెద్ద జాతరంటే సుమాయిష్ ఒక్కటే. పాతిక లక్షల మందికి పైగా కొనడానికి, తినడానికి, చూసిపోవడానికి వస్తున్నరంటే ఈ జాతర ఎట్లుంటదో అర్థం చేసుకోవచ్చు..
క్రాఫ్ట్ మేళా దిల్ ఉంటే ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అందుకే హైదరాబాదీలంతా ఏటా సుమాయిష్ కు వస్తునే ఉన్నారు. సాయంత్రాల్లో బయటికి పోవాలని అందరూ అనుకుంటారు. కానీ పాతబస్తీ, అబిడ్స్, నారాయణగూడ సమీప ప్రాంతాలో ఉన్న వారికి ఔటింగ్కు తగిన ప్రదేశాలు లేవు.
సిటీలో సకుటుంబసమేతంగా బయటికిపోవాలని కోరుకునే వాళ్లందరికీ ఈ సుమాయిష్ మంచి సీజన్. సుమాయిష్ వచ్చే నాటికి ఎముకలు. కొరికే చలికి నగరం వణికిపోతోంది. అయితేనేం జనం ఆ పులికి భయపడకుండా ప్రేమతో వస్తూనే ఉన్నారు.
పొద్దుగూకితే నాంపల్లి రోడ్లపై నుంచి నుమాయిష్ గేటుకు పుట్టపగిలి చీమలొచ్చినట్లుంటున్నారు జనం. ఆ జనంలో పడి నడుచుకుంటూ సుమాయిస్ లో అడుగుపెడితే మైకులో బాలీవుడ్ గోల్డెన్ క్లాసిక్స్ పసందు చేస్తున్నాయి. మనోరంజకమైన సంగీతానికి తగ్గట్టు కళ్లెదురుగానే కశ్మీరీచేనేత కళలను అద్దంపట్టే చేనేత అందాలు. లక్నో చికన్ వర్క్ దుస్తులు మనోరంజకంగా కనిపిస్తున్నాయి.
ALSO READ : హైదరాబాద్లో 11 HMPV కేసులు.. మాయదారి చైనా వైరస్.. డిసెంబర్లోనే తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చేసిందంట..!
ఎడముకుపోతే ఈ అందాలు ఇక కుడివైపుకు చూస్తే విద్యుత్ బల్బుల వెలుగులో హ్యాండ్ మేడ్ జువెలరీ ధగధగ మెరిసిపోతోంది. ఆ పక్కనే బెంగాలీ జూట్ హ్యాండీ క్రాఫ్ట్స్ జెరా. అనిపిస్తున్నాయి. జనపనారతో ఇన్ని అందాలు సృజించొచ్చా అని ఆలోచిస్తూ ముందుకు మూడడుగులు వేయంగనే ఆదిలాబాద్ఆదివాసులు తయారు చేసిన దోడ్రా బొమ్మలు కనిపించినయ్.
అరె భలేగున్నయే అని చూస్తూపోతుంటే తంజావూరు చిత్రాలు విచిత్రంగా తోస్తున్నయ్. ఆ చిత్రాలు చూసే పనిలో అగుతూ, నడుస్తూ సాగిపోతున్నడు. సందర్శకులు, నారాయణపేట చీరలు, పోచంపల్లి చేనేత అందాలు, నిర్మల్ బొమ్మలు, వరంగల్ దరీలు చూస్తుంటేనే టైమైపోయిందని మైకులో మోగిపోతుంది. రేపు మళ్లొద్దామంటూముగించుకుని పోతారు.
అనుకున్నట్లే వచ్చి మళ్లీ షాపింగ్ మొదలు పెడతారు. ఈవినింగ్ పిల్లల్ని వెంటపెట్టకుని వచ్చే పెద్దలతో, కళకళలాడే స్టాల్స్తో కనువిందు చేసే నుమాయిష్లో కలియతిరుగుతూ కాలం గడపడం స్థానికులకు ఎంతో సంతోషం. ఆ సంతోషమే వేలాది కుటుంబాలకు సుమాయిష్ తో అనుబంధం పెంచింది. దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ నుమాయిష్ అనుబంధం బలపడింది.
పసందైన వేళలో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ లు వచ్చినా సుమాయిష్ కు ఆదరణ తగ్గలే! సంక్రాంతికి ముందు రోజుల్లో కిటకిటలాడే చేనేత ప్రాళ్ళ పక్కనే ఉండే క్రాకరీ స్టాల్స్ కూడా అంతే కిటకిటలాడుతున్నయి. వచ్చే రంజాన్ కోసం కొత్త పింగాణీ పాత్రల్ని ముస్లింలు కొనుగోలు చేస్తున్నారు. వేసవిలో పెండ్లి వేడుకల కోసం రాజస్తానీ, గుజరాతీలు ఎత్నిక్ దుస్తుల కోసం.
ఈ స్టాళ్ల మధ్య తిరగుతూ హడావిడి చేస్తున్నారు. అన్ని వయసుల వారికి అందమైన దుస్తులు, ఆభరణాలు, ఫుట్ వేర్.. ఇంటిల్లిపాదికీ కావా ల్పిన అటవస్తువులు, గృహాలంకారాలు, ఫ ర్నీచర్, కిచెన్వేర్, హోమ్ నీడ్స్.. మరెన్నో ఉండే సుమాయిష్లో షాపింగ్ చేయడమంటే సెలబ్రేషన్ చేసుకున్నట్లన్నమాట. వేల స్టాళ్ల మధ్య ఎంత చూసినా చూడాలనిపిస్తుంది.
నిలబడి నిలబడీ కాళ్లు నొప్పి లేస్తే 'కాసేపు కూసోని తినిపోండని' పుడ్ కోర్ట్ వాళు ఆహ్వానిస్తూ ఉంటారు. బేల్ పూరీ, పానీపూరీ, సమోసా, చాయ్ ఏది కావాలంటే అది రెడీ. ఈ మాత్రం చాలదంటే ఇంకా కొంచెం పెద్ద. మెనూ కూడా ఉంది. హైదరాబాద్ బిర్యానీ, ధమ్ బిర్యానీ, కుండ బిర్యానీ, కబాబ్స్, షోర్వా ఇలా ఘాటైన వంటకాలను ఆరగించిపోవాలని ఘుమఘుములతో గాలి స్వాగతిస్తుంది.
తియ్యని సేమియాలు, ఐస్క్రీమ్స్, చాట్, స్వీట్స్, లస్సీ, జ్యూస్లు అబ్బో ఎన్ని రుచులో ఈ పసందైన జాతరలో! అమ్మకాలు.. నమ్మకాలు, కొనుక్కునేవాళ్లు సుమాయిష్లో ఉంటే కోఠీలో దుకాణం తెరిచి లాభం లేదని వ్యాపారులుపంథా మార్చారు. అబిడ్స్, కోరి, నారా యణగూడ, ఓల్డ్ సిటీ, మెహిదీపట్నం, బంజా రాహిల్స్, లక్షీకపూల్లో కనిపించే ఫేమస్ జువెలరీ, బాడీ, డ్రెస్, స్వీట్స్, హోటల్స్, ఫుట్వేర్ బోర్డులన్నీ సుమాయిష్ లో బ కనిపిస్తూ ఉంటాయి.
ఈ బోర్డులు చూస్తుంటే 'ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నామా? హైదరాబాద్ సిటీ వీధుల్లో తిరుగుతున్నామా?' అని సందేహం వస్తుంది. అయితే అడిగితే తెలిసింది. నగరంలోని ప్రముఖ వ్యాపార సంస్థలన్నీ అనివార్యంగా ఈ నుమాయిష్ లో స్టాల్స్ ఏర్పాటు చేయక తప్పట్లేదు. పోటీ మార్కెట్లో తప్పనిసరిగా తక్కువ రేటుకే అమ్మాల్సి రావడం వ్యాపారులకు కొంత కష్టమే అయినా లక్షలాది మందికి చేరువయ్యే అవకాశం మాత్రం బాగా నే కలిసొస్తుందంటున్నారు.
ఈ ప్రచారం కోసమే కొత్త బ్రాండ్స్ ని పరిచయం చేసేందుకు కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడికొచ్చినయ్. హస్తకళలు, కుటీర పరిశ్రమల ఉత్పత్తులు అధికంగా ఉండే సుమాయిష్ లో ప్రచారం కోసం పోటీ పడుతున్నాయ్. నుమాయిష్ లో ఏది కొన్నా కొనకున్నా కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ కొనాలంటరు సిటీ జనం. ఇక్కడమ్మే కశ్వీర్ సిల్క్ వస్త్రాలు, ఆభరణాలు, డ్రై ఫ్రూల్స్ కు గిరాకీ ఎక్కువ.
తొలి నుమాయిష్ స్టాల్ ఏర్పాటు చేసిన డ్రై ఫ్రూట్స్ వ్యాపారులు ఏ ఒక్క ఏడాదినీ వదలకుండా వస్తున్నారు. సరుకు మంచిదైతే సుమాయిష్లో లాభం గ్యారంటీ అని కశ్మీరీ వ్యాపారుల నమ్మకం. నుమాయిష్ కోసం వచ్చే కశ్మీర్ వ్యాపారులు ఏటా పెరుగుతున్నారే కానీ తగ్గట్లే! ఈ నుమాయిష్ లో సరుకుల అమ్మకమే కాదు. సేవల సదుపాయమూ ఉంది.
బ్యాంకు ఖాతాలు, పెన్షన్లు, ట్రాఫిక్ రూల్స్, ఉపాధి కల్పన మొదలైన కార్యక్రమాలెన్నో ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు కూడా ఇందులో పాల్గొన్నాయి.
ప్రభుత్వ సేవలను ఎలా పొందాలి? ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు అడిగినోళ్లకు చెబుతున్నరు. రెండున్నర వేలకు పైగా ఉన్న స్టాళ్లను చూడాలంటే రెండు కళ్లు చాలవు.