నుమాయిష్లో అనుకోని ఘటన.. రివర్స్లో ఆగిన రేంజర్​.. 15 నిమిషాలు తలకిందులు గానే..

నుమాయిష్లో అనుకోని ఘటన.. రివర్స్లో ఆగిన రేంజర్​.. 15 నిమిషాలు తలకిందులు గానే..

బషీర్ బాగ్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్​గ్రౌండ్స్లోని నుమాయిష్లో ఏర్పాటు చేసిన అమ్యూజ్మెంట్​పార్క్లో గురువారం సాయంత్రం అనుకోని ఘటన జరిగింది. ఎగ్జిబిషన్​లో ఏర్పాటు చేసిన రేంజర్లో సాయంత్రం ఆరు గంటలకు సుమారు ఐదుగురు సందర్శకులు ఎక్కారు. అది ఊగుతూ ఊగుతూ గాల్లోనే రివర్స్​లో ఆగిపోయింది. దీంతో అందులో కూర్చున్న సందర్శకులు అరుపులు, కేకలు పెట్టారు.

హుటాహుటిన అక్కడికి వచ్చిన పోలీసులు ఏమైందని ఆరా తీయగా, బేరింగ్ ల సమస్యతో రేంజర్ పైకి వెళ్లి ఆగిపోయిందని నిర్వాహకులు తెలిపారు. రిపేర్​చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, టైం పట్టే అవకాశం ఉందని చెప్పారు. అప్పటికే 15 నిమిషాలు కావడం, సందర్శకులు రేంజర్​లో ఏడుస్తూ ఉండడంతో నిర్వాహకుల సాయంతో నిచ్చెన వేసి కిందకు దింపారు.