శుభకార్యం మొదలు పెట్టేటప్పుడు అదృష్ట సంఖ్య .... కలసి వచ్చే రోజును ఎంచుకుంటారు. దీనిని తెలుసుకొనేందుకు సంఖ్యాశాస్త్ర నిపుణులను సంప్రదిస్తారు. ఇంతవరకు ఎవరు చెప్పినా 13 సంఖ్య మంచిదికాదని.. ఆ సంఖ్య ఉన్న సమయం ఎవరికి శుభాలు చేకూర్చదని... అశుభ సంఖ్యగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం నంబర్ 13 రాహు గ్రహానికి చెందినది.ఈ తేదీతో సంబంధం ఉన్న వ్యక్తులు రాహు గ్రహం నియంత్రణలో తమ జీవితాన్ని గడుపుతారు. కాని అయోధ్య రామాలయం 2024 జనవరి 22న( 22-01-2024 అంటే 2+2+0+1+2+0+2+4=13) ప్రతిష్ఠ కావడంతో 13 సంఖ్యకు ఉన్న అశుభం తొలగిపోయిందని కొంతమంది పండితులు అంటున్నారు.
అయోధ్య రామ్ లల్లాకు ఈ అంకె చాలా శుభం చేకూర్చిందని ....హిందూ సంప్రదాయంలో, 13 (తేరా) సంఖ్య రాముడికి.. బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే కలిసొచ్చింది. 13సంఖ్యకు ఉన్న చరిత్రను పరిశీలిస్తే .... 13 రోజుల్లో తొలి బీజేపీ ప్రభుత్వం పడిపోయినా... మళ్లీ 13 పార్టీల మద్దతుతో 13వ లోక్ సభ బీజేపీ ఆధ్వర్యంలో ఆవిర్భవించింది. ఇంకా హిందూ ధర్మశాస్త్రంలో ఎవరైనా మరణిస్తే ఆ రోజు నుంచి 13వ రోజున ఆ కుటుంబసభ్యులు విషాదంతో శుద్దవుతారు.. 13 అంకె ఇన్ని అశుభాలను సూచిస్తున్నా.... అయోధ్య రాముడికి .. బీజేపీకి మాత్రం అదృష్ట సంఖ్యగా మారింది.
మానవుడికి కలిసి వచ్చే సంఖ్యలు కూడా ఉంటాయి. వివిధ రాశుల్లో జన్మించిన జాతకులు అదృష్ట సంఖ్యలు, మంచి రోజులను బట్టి కార్యాచరణ చేయడం ఉత్తమమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అదృష్ట సంఖ్యల్లో వాహనాలు కొనడం, రాశికి అనుగుణమైన రోజున శుభకార్యాన్ని మొదలు పెట్టడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయని నమ్ముతుంటారు. ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను పరిశీలిస్తే 13 సంఖ్య ఎవరికీ కలిసిరాదు. వివిధ దేశాలలో, సంఖ్యాశాస్త్రం ప్రకారం 13 సంఖ్య అశుభకరమైనదిగా పరిగణిస్తారు. 13 అంకెతో సంబంధం కలిగిన కొన్ని అపోహలను ఇప్పుడు చూద్దాం.
13 రోజుల బీజేపీ ప్రభుత్వం
భారత రాజకీయాల్లో 13 అంకెకు సంబంధముంది. ప్రస్తుతం రామ్ లల్లా విగ్రహాన్ని స్థాపించిన బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా1996 కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పదవిలో ఉన్నారు. పార్లమెంటులో పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఆయన ప్రభుత్వం పడిపోయింది.
13వ లోక్ సభ
13వ లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ఈ అంకెతో ముడిపడి ఉంది. ఈ సంఖ్యతో ముడిపడి ఉన్న మూఢనమ్మకాలను సవాలు చేస్తూ 13 పార్టీల మద్దతుతో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడింది.
హిందూమతంలో ...
హిందూ మతంలో 13 అంకెను అశుభ దినంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి మరణించిన తరవాత ఆ కుటుంబ సభ్యులు శుద్దవుతారు. 13 వ రోజున విషాదంతో విందు.. పిండ ప్రధానం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
13 నెంబర్ ఫోబియో..
పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో గదులకు డిజిట్స్ కేటాయించేటప్పుడు థర్టీన్ డిజిట్ ను ఫోబియోగా పరిగణించి స్కిప్ చేస్తారు. ఫ్రాన్స్ దేశంలో డైనింగ్ టేబుల్స్ 13 ఉండవు. ఇక చైనా జ్యోతిష్యులు 13 సంఖ్యను పెద్ద భూతంగా పరిగణిస్తారు. కొన్ని కొన్ని ఆస్పత్రులు.. హోటల్స్ ఆ తేదీన మూసివేయాలని కూడా చైనా జ్యోతిష్యులు చెబుతుంటారు.
క్రిస్టియన్లు కీడుకు సంకేతంగా 13
క్రిస్టియన్లు 13 సంఖ్యను కీడుకు సంకేతంగా భావిస్తారు. పూర్వం సర్వమతాలకు సంబంధించి ఒక సదస్సు జరిగిందట. అప్పుడు అందరికి విందు ఏర్పాటు చేశారని.. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీల్లో 13 వనెంబరు కుర్చీలో ఏసు కూర్చోవడానికా రాగా.. ఆయనను తప్పించి మరొకరు కూర్చొన్నారని కొంతమంది క్రిస్టియన్ మత పెద్దలు చెబుతుంటారు. అప్పటి నుంచి 13 సంఖ్యను క్రిస్టియన్లు కీడుకు సంకేతంగా భావిస్తున్నారట.
జైనులు.. సిక్కులకు కూడా అశుభమే
జైనులు, సిక్కులు 13 సంఖ్యను దురదృష్టకరమైన సంఖ్యగా భావిస్తారు. ఆచార్య భిక్షువు చెప్పిర సిక్కుమతంలోని గురునానక్ దేవ్ జీ సందేశం ప్రకారం 13 సంఖ్య గురించి వివరించారు.