దేశంలో డబ్బున్నోళ్లు దండిగా పెరుగుతున్రు .. వెల్లడించిన సెంట్రమ్ రీసెర్చ్ రిపోర్ట్

దేశంలో డబ్బున్నోళ్లు దండిగా పెరుగుతున్రు .. వెల్లడించిన సెంట్రమ్ రీసెర్చ్ రిపోర్ట్

హైదరాబాద్​, వెలుగు : సంవత్సరంలో రూ. 10 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న భారతీయుల సంఖ్య గత ఐదేళ్లలో 63 శాతం పెరిగిందని సెంట్రమ్ ఇన్​స్టిట్యూషనల్ రీసెర్చ్ రిపోర్ట్​ వెల్లడించింది. మనదేశంలో సంపన్నుల సంఖ్య వేగంగా పెరుగుతోందని తెలిపింది. ఈ రిపోర్టు ప్రకారం.. ఏటా రూ. 5 కోట్లకు పైగా సంపాదిస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగి 58,200 మందికి చేరింది. ఐదేళ్లలో 49 శాతం పెరిగారు. దేశంలో ఇప్పుడు దాదాపు 31,800 మంది సంవత్సరానికి రూ. 10 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. 2019 ఆర్థిక సంవత్సరం నుంచి -2014  ఆర్థిక సంవత్సరం వరకు వీరి సంఖ్య విపరీతంగా పెరిగింది. 

 ఏటా రూ. 50 లక్షలకు పైగా సంపాదించే వారి సంఖ్య 25 శాతం పెరిగింది. దాదాపు 10 లక్షల మంది వ్యక్తులు ఈ బ్రాకెట్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చారు. అయితే, మనదేశంలో 15శాతం ఆర్థిక సంపదను మాత్రమే వృత్తినిపుణులు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో 75 శాతం డబ్బును ప్రొఫెషనల్స్​ ద్వారా ఇన్వెస్ట్​చేయిస్తున్నారు.

వేగంగా పెరుగుదల..

సంపన్నుల డబ్బు వేగంగా వృద్ధి చెందుతోంది.  సంవత్సరానికి రూ. 10 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి సంచిత ఆదాయం 2019 ఆర్థిక సంవత్సరం – 2014  ఆర్థిక సంవత్సరాల మధ్య 121 శాతం సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్​)తో రూ. 38 లక్షల కోట్లకు చేరుకుంది. రూ. 5 కోట్లకు పైగా సంపాదిస్తున్న వారికి సీఏజీఆర్​ 106 శాతంగా ఉంది. వీళ్ల మొత్తం ఆదాయం రూ. 40 లక్షల కోట్లకు చేరుకుంది. ఏటా రూ. 50 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తుల మొత్తం ఆదాయం గత ఐదేళ్లలో రూ. 49 లక్షల కోట్లతో 64 శాతం వృద్ధి చెందింది.    మనదేశంలో హై నెట్ వర్త్ వ్యక్తులు (హెచ్​ఎన్​ఐ)  అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ (యూహెచ్​ఎన్​ఐ) సంపదలో వృద్ధి ఇక ముందు కూడా కొనసాగుతుంది.  వీళ్ల సంపద 2023-28 మధ్య ఏటా 13–-14 శాతం పెరగొచ్చని సెంట్రమ్ రీసెర్చ్ రిపోర్ట్ అంచనా వేసింది.