ట్యాక్స్​ కట్టేట్టోళ్లు పెరిగారు..పదేళ్ళలో ఐదురెట్లు

ట్యాక్స్​ కట్టేట్టోళ్లు పెరిగారు..పదేళ్ళలో ఐదురెట్లు

న్యూఢిల్లీ: కోటి రూపాయల కంటే ఎక్కువ ట్యాక్సబుల్​ ఇన్​కమ్​ గల వారి సంఖ్య గత పదేళ్లలో ఐదు రెట్లు పెరిగింది. 2023–-24 (2022-–23 ఆర్థిక సంవత్సరం) అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సంవత్సరంలో వీరి సంఖ్య 2.3 లక్షలు ఉండగా,  2012–-13 ఆర్థిక సంవత్సరంలో 44,078 మంది మాత్రమే ఉండేవారు.  

అసెస్​మెంట్​ఇయర్2022-–23లో రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారి సంఖ్య దాదాపు 52శాతం ఉంది. ఇది అంతకు ముందు సంవత్సరంలో 49.2శాతం కాగా, 2013-–14 అసెస్​మెంట్​ఇయర్లో 51శాతం ఉంది. రూ.1–-5 కోట్లు సంపాదిస్తున్న జీతం పొందే వారి సంఖ్య  53శాతం వరకు ఉంది.