- కొన్నింటిలో ఒక్కరూ చేరలేదు
- హాస్టళ్లలో వసతుల లేమి
- పట్టింపులేని ఆఫీసర్లు ఆసక్తి చూపని పేరెంట్స్
యాదాద్రి, వెలుగు : సంక్షేమ హాస్టళ్లలో ఏటా స్టూడెంట్ల సంఖ్య తగ్గుతోంది. ఎవరొచ్చిచేరుతారా..? అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు స్టూడెంట్స్చేరకపోవడంతో కొన్ని హాస్టల్స్క్లోజ్చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. యాదాద్రి జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. స్థానికంగా ఉండని వార్డెన్లు, ఇన్చార్జిలు సైతం సిబ్బందికే అన్ని బాధ్యతలు అప్పజెప్పడం, అరకొర వసతులు, నిర్లక్ష్యం కారణంగా హాస్టళ్లలో ఏటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.
యాదాద్రిలో 49 హాస్టల్స్..
జిల్లాలో 21 ఎస్సీ, 20 బీసీ, 8 ఎస్టీ హాస్టల్స్ఉన్నాయి. 6,500 మంది స్టూడెంట్స్‌కు వసతి కల్పించాల్సి ఉంది. హాస్టళ్లల్లో కనీస సౌకర్యాలు కల్పించడంపై శ్రద్ధ చూపకపోవడంతో విద్యార్థులు చేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలేరు వంటి కొన్నిచోట్ల పాత బిల్డింగ్‌లోనే హాస్టల్స్నడుస్తున్నాయి. పైగా ఫుడ్విషయంలోనే ఎక్కువగా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. ఏదో ఒకటి పెడితే చాలు తింటారన్నట్టుగా వ్యవహరించడంతో చేరడానికి స్టూడెంట్స్ ఇంట్రస్ట్చూపడం లేదు.
పేరెంట్స్కూడా హాస్టల్స్‌లో తమ పిల్లలను చేర్పించడంపై ఆసక్తి కనబర్చడం లేదు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఈ ఏడాది మూడు వేలకుపైగా సీట్లు ఖాళీగా ఉండటమే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు హాస్టల్లో సీటు కావాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరిగేవారు. ప్రస్తుతం ఎవరైనా విద్యార్థులు వచ్చి చేరుతారా..? అని ఎదురుచూసే దుస్థితి నెలకొంది. కొన్ని చోట్ల స్టూడెంట్స్తక్కువగా ఉన్న హాస్టల్స్‌ను ఇతర హాస్టల్స్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల విలీనం చేసి హాస్టల్స్‌ను క్లోజ్ చేసిన సంఘటలూ ఉన్నాయి. భువనగిరిలోని ఓ హాస్టల్లో ఫుడ్‌పాయిజన్ కారణంగా ఒక స్టూడెంట్చనిపోయిన సంగతి తెలిసిందే. అదే విధంగా బాలికల హాస్టల్లో ఇద్దరు పదో తరగతి అమ్మాయిలు సూసైడ్చేసుకున్నారు.
కొన్ని హాస్టల్స్‌లో ఒక్కరూ చేరలే..
జిల్లాలోని కొన్ని హాస్టల్స్‌లో ఒక్క స్టూడెంట్ కూడా ఈ ఎడ్యుకేషన్ఇయర్లో చేరలేదు. 21 ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి. సీతారాంపురం, వలిగొండలోని హాస్టల్స్‌లో వంద మంది స్ట్రెంత్ ఉండాల్సి ఉండగా, ఒక్కరూ చేరలేదు. అదే విధంగా బీసీ హాస్టల్స్‌లో 20 ఉండగా, మోత్కూరు, తుర్కపల్లి, వలిగొండ, ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్‌లోని హాస్టల్స్‌లో ఒక్కరూ చేరలేదు. ఇందులో మోత్కూరులోని బీసీ హాస్టల్‌ను మూసి వేశారు. ఎవరూ చేరని మరికొన్ని హాస్టల్స్‌ను మూసి వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్టీ హాస్టల్స్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 8 హాస్టల్స్ఉండగా, దాదాపు 600 మంది స్టూడెంట్స్ఉన్నారు. మరికొన్ని హాస్టల్స్‌లో 30 నుంచి 60 మంది వరకు స్టూడెంట్స్మాత్రమే ఉన్నారు.
భువనగరిలోని బాయ్స్‌హాస్టల్‌లో ఫుడ్పాయిజన్కారణంగా పదుల సంఖ్యలో స్టూడెంట్స్హాస్పిటల్ పాలయ్యారు. వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా మారి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. చివరకు అందులో ఒక స్టూడెంట్చనిపోయాడు.
భువనగిరిలో బాలికల హాస్టల్లో ఇద్దరు పదో తరగతిచదువుతున్న బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన స్టేట్ లెవల్లో సంచలనంగా మారింది. విచారణ నిర్వహించినా చివరకు కేసు మూసేశారు. పైన పేర్కొన్న రెండు ఘటనలు హాస్టళ్లలో స్టూడెంట్స్ భద్రత, ఆరోగ్యంపై స్టాఫ్ ఏ పాటి శ్రద్ధ చూపిస్తున్నారో అర్థమవుతుంది