మహిళల లోన్లు పెరుగుతున్నాయ్.. బిజినెస్‌‌ లోన్లు, గోల్డ్‌‌ లోన్ల కంటే.. వస్తువులు కొనడానికి అప్పులెక్కువ చేస్తున్నరు..!

మహిళల లోన్లు పెరుగుతున్నాయ్.. బిజినెస్‌‌ లోన్లు, గోల్డ్‌‌ లోన్ల కంటే.. వస్తువులు కొనడానికి అప్పులెక్కువ చేస్తున్నరు..!

న్యూఢిల్లీ: మహిళలు అప్పులు తీసుకోవడం పెరుగుతోంది. గత ఐదేళ్లలో మహిళా బారోవర్లు ఏడాదికి 22 శాతం చొప్పున పెరిగారు. వీరిలో చాలా మంది  చిన్న పట్టణాలు, గ్రామాలకు చెందిన వారే ఉన్నారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం, మహిళలు టీవీలు, ఏసీలు వంటివి కొనడానికే ఎక్కువగా లోన్లు తీసుకున్నారు. బిజినెస్‌‌ అవసరాలకు పెద్దగా లోన్లు తీసుకోలేదు. ట్రాన్స్‌‌యూనియన్ సిబిల్‌‌, నీతి ఆయోగ్‌‌ ఉమెన్ ఎంటర్‌‌‌‌ప్రెనూర్‌‌‌‌షిప్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ (డబ్ల్యూఈపీ), మైక్రోసేవ్ కన్సల్టింగ్‌‌ (ఎంఎస్‌‌సీ) కలిసి  ఈ రిపోర్ట్‌‌ను రెడీ చేశాయి.

‘మహిళలు అప్పులు తీసుకోవడం వేగంగా పెరుగుతోంది. వస్తువులు కొనడానికి ఈ లోన్లను ఎక్కువగా వాడుతున్నారు. మరోవైపు బిజినెస్‌‌ల కోసం కూడా లోన్లు తీసుకున్నవారు పెరుగుతున్నారు’ అని  నీతి ఆయోగ్ రిపోర్ట్ వెల్లడించింది. కిందటేడాది మహిళలు తీసుకున్న మొత్తం  అప్పులో  కేవలం 3 శాతం మాత్రమే బిజినెస్‌‌ లోన్లు ఉన్నాయి. 2019 నుంచి  వీరు బిజినెస్ లోన్లు తీసుకోవడం 4.6 రెట్లు పెరిగింది. అయినప్పటికీ తీసుకున్న అమౌంట్ ఇంకా తక్కువగానే ఉంది. మరోవైపు కిందటేడాది మహిళలు తీసుకున్న మొత్తం లోన్లలో  పర్సనల్ లోన్లు, కన్జూమర్ డ్యూరబుల్ లోన్లు, హోమ్‌‌ లోన్ల వాటా 42 శాతంగా ఉంది. గోల్డ్‌‌పై తీసుకున్న లోన్ల వాటా 38 శాతంగా ఉంది.

నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం, చాలామంది మహిళా బారోవర్లు లోన్లను తీసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు.  ఎప్పటికప్పుడు తమ క్రెడిట్ స్కోర్‌‌‌‌ను మానిటర్ చేస్తున్నారు.  కిందటేడాది డిసెంబర్ నాటికి  సుమారు 2.7 కోట్ల  మంది మహిళా బారోవర్లు తమ అప్పులను  యాక్టివ్‌‌గా మానిటర్ చేశారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 42 శాతం గ్రోత్ నమోదైంది.

మహిళల్లో ఫైనాన్షియల్ అవేర్‌‌‌‌నెస్ పెరుగుతోందని తెలుస్తోంది.  వీరిలో కూడా 60 శాతం  మంది గ్రామాలు, చిన్న పట్టణాల నుంచే ఉన్నారు. ఫైనాన్షియల్ అవేర్‌‌‌‌నెస్‌‌ మెట్రోలను దాటి గ్రామాల్లో విస్తరిస్తోందని ఎంఎస్‌‌సీ ఎండీ మనోజ్ కుమార్ శర్మా అన్నారు. అప్పులను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న మహిళా బారోవర్లలో  జెన్‌‌జెడ్‌‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. వీరు ఏడాది లెక్కన 58 శాతం పెరిగారు.

బిజినెస్‌‌లపై దృష్టి
మహిళలు బిజినెస్‌‌పై దృష్టి పెట్టడం గత ఐదేళ్లలో పెరిగింది.  వీరు బిజినెస్‌‌ లోన్లు తీసుకోవడం 14 శాతం పెరగగా, గోల్డ్‌‌ లోన్లు తీసుకోవడం 6 శాతం పెరిగింది. కిందటేడాది డిసెంబర్ నాటికి బిజినెస్‌‌ లోన్లు తీసుకున్నవారిలో మహిళా బారోవర్లు వాటా 35 శాతంగా రికార్డయ్యింది. కొలేటరల్‌‌, గ్యారెంటర్స్‌‌కు సంబంధించిన సమస్యలు, అప్పులు తీసుకోవడానికి ఇష్టపడకపోవడం, ఈజీగా లోన్లు రాకపోవడం వంటి సమస్యలు కూడా లేకపోలేదని నీతి ఆయోగ్ రిపోర్ట్ పేర్కొంది.

లోన్లపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌‌లను తీసుకొచ్చే అవకాశం కంపెనీలకు ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు లోన్ల చెల్లింపులపై మెట్రోల్లో కంటే నాన్ మెట్రోల్లోని మహిళలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మహిళా వ్యాపారులను  ప్రోత్సహించాలంటే వారికి ఆర్థికంగా సాయం చేయాలని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్‌‌‌‌ సుబ్రమణ్యం పేర్కొన్నారు.

ప్రభుత్వ పాలసీల దన్నుతో మహిళా వ్యాపారులు పెరుగుతారని అన్నారు. నీతి ఆయోగ్ ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్‌‌‌‌ అన్న రాయ్‌‌ మాట్లాడుతూ, మహిళా వ్యాపారులను ప్రోత్సహించడం ద్వారా 15–17 కోట్ల ఉద్యోగాలను క్రియేట్ చేయొచ్చని, మహిళలు జాబ్స్‌‌లో జాయిన్ అవ్వడం కూడా మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు.