సంఖ్యాశాస్త్రం: మీ ఫోన్ నెంబర్లో ఈ నంబర్స్  ఉన్నాయా.. ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..

సంఖ్యాశాస్త్రం: మీ ఫోన్ నెంబర్లో ఈ నంబర్స్  ఉన్నాయా.. ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..

మొబైల్​ నంబర్లలో పిల్లర్​ నంబర్స్​ ఏమిటంటే 1,4,5,6,9 ఇవి చాలా ముఖ్యమైన నంబర్లు .. ప్రతి మొబైల్​ నంబర్లలో ఈ ఐదు నంబర్లు ఉండాలి.  మొబైల్​ నంబర్లలో ఈ ఐదు పిల్లర్లు ఉండాలి. అసలు ఈ నంబర్లు ఎందుకు ఉండాలో తెలుసుకుందాం.  

 
1  నంబర్​ మొబైల్​ నంబర్లలో ఉంటే .. వృత్తి. వ్యాపారాలతో పాటు భార్య భర్తల అన్యోన్య సంబంధమైన విషయాల్లో చాలా అద్భుతంగా రాణించగలుగుతారు.  ఈ నంబర్​ లీడర్​ షిప్​ క్వాలిటీస్​ సూచిస్తుంది. మీ మొబైల్​ నంబరులో 1 ఉంటే ఏ రంగంలో ఉన్నా.. నంబర్​ 1 పొజిషన్​ కు వెళతారు.   మీ దగ్గర ఎంత శక్తి సామర్ద్యాలు ఉన్నా.. మీ మొబైల్​ నంబర్​ లో 1 లేకపోతే అత్యున్నత స్థాయికి చేరుకొనే అవకాశం లేదని సంఖ్యా శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.కాని ఈ నెంబరు ఎండింగ్​ లో ఉండకూడదని పండితులు సూచిస్తున్నారు. 

4వ నంబర్​ : సంఖ్యా శాస్త్ర నిపుణుల ప్రకారం ...ఈ నెంబర్​ రాహువును ఇండికేట్​ చేస్తుంది.  ఇది మనీకి సంబంధించిన సంఖ్య.. మీ మొబైల్​ నంబర్లలో 4 వ నెంబర్​ ఉంటే వృత్తి వ్యాపారాల్లో డబ్బులను ఆకర్షిస్తుంది.  మీ మొబైల్​ నంబర్లలో 4 వ నంబర్​ లేకపోతే  మీకు డబ్బు వచ్చినా ఉండదంటున్నారు పండితులు.  మీ బ్యాంక్​ అక్కౌంట్​ నంబర్లలో 4 వ నెంబర్ ఉన్నదో లేదో ఒకసారి చెక్​ చేసుకోండి... అలాగే మీ బ్యాంక్​ ఖాతాలకు లింక్​ అయిన ఫోన్​ నంబర్లలో 4 నెంబర్​ ఉండేలా చూసుకోమని పండితులు సూచిస్తున్నారు. ఇది కూడా ఎండింగ్​ లో అంటే 10 వ నంబర్​గా ఉండకూడదట.. 

5 వ నెంబర్​.. ఇది  బుధ గ్రహానికి సంబంధించిన నంబర్​... ఈ నంబర్​ కమ్యూనినేషన్​ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మీ మొబైల్​ నంబర్లలో 5 ఉన్నట్లయితే  మీరు ఎక్కడ ఉన్నా.. కుటుంబంలో, వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో , సమాజంలో, రాజకీయంలోగాని ...  ఏరంగంలోనైనా రాణించాలంటే  కమ్యూనికేషన్​ చాలా అవసరం. కమ్యూనికేషన్​ లోపిస్తే ఏ ప్రాజెక్ట్​ కూడా చేపట్టలేరు. మీరు చేయాలనుకున్నది ఇతరులకు చెప్పలేరు. మీ మొబైల్​ నంబర్లలో 5 వ నెంబర్​ లేకపోతే.. మీరు చెప్పేది ఇతరులు పట్టించుకోరు.  భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్​ లోపిస్తుందని అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. 

6 వ నెంబర్​.. ఇది యోగాన్ని సూచిస్తుంది. ఇది విలాసాలను సూచిస్తుంది.  డబ్బు  ఉన్నా.... అధికారం ఉన్నా.. కొంతమంది ఎప్పుడు జీవితంలో ఏదో పోగొట్టుకున్నవారి వలె జీవిస్తారు.  మీ మొబైల్​ నంబర్లలో 6 అనే అంకె లేకపోతే ఇలాంటి నిస్సత్తువైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. .  మొబైల్​ నంబర్లలో 6 సంఖ్య ఉంటే.. సంఖ్యా శాస్త్రం ప్రకారం  లగ్జరీ జీవితాన్ని  అనుభవిస్తారు.  మీ మొబైల్​ నంబర్లలో 6 లేకపోతే మీరు ఎంత కష్టపడ్డా... లగ్జరీని అనుభవించే అవకాశం ఉండదని పండితులు చెబుతున్నారు. 

9  వ నెంబర్​ : ఇది ఆస్తులకు, ధైర్యానికి  సంబంధించి నంబర్... మీరు ఏరంగంలో కూడా   ధైర్యం లేకపోతే రాణించలేదు.. అందుకే ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు.. అందుకే మీ మొబైల్​ నంబర్లలో 9 నంబర్​ ఉండేలా చూసుకోండి.  9 వ నెంబర్​ పోరాట పటిమను సూచిస్తుంది. 

ఎండింగ్​ లో 10 వ నంబర్​ స్థానంలో ఏ నంబర్లు ఉండకూడదంటే....

  • మొబైల్​ నంబర్​ ఎండింగ్​ లో మాత్రం 0,4,7,8,1,2,3 ఈ నెంబర్లు ఉండకూడదని సంఖ్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 
  • 0 ఉంటే మీరు ఎంత కష్టపడినా జీరో పొజిషన్​ కే వస్తారుమొబైల్​ నంబర్​ ఎండింగ్​ లో 4 ఉంటే చాలా డేంజరస్​ ... ఎంత డబ్బు సంపాదించినా.. ఆర్ధికంగా ఇబ్బందులు పడతారని సంఖ్యాశాస్త్రనిపుణులు చెబుతున్నారు.  వీరికి ఎలాంటి ఆలోచన రాదు.. ఎవరైనా చెప్పినా వినరని పండితులు చెబుతున్నారు.  వీరికి సమాజంలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.  అందువలన ఫోన్​ నెంబర్లలో 4 సంఖ్య 10 వ స్థానంలో ఉండకుండా చూసుకోండి.  
  • ఫోన్​ నెంబర్లలో 10 వ అంకెగా 7 ఉంటే భార్యభర్తల మధ్య గొడవలు, ఆర్ధిక ఇబ్బందులు వస్తాయని సంఖ్యశాస్త్రం చెబుతోంది.  
  • పోన్​ నెంబర్​ ఎండింగ్​ 8 నెంబర్​ ఉంటే కోర్టు వివాదాలు... అనుకున్న పనులు నిదానంగా జరగడం.. లాంటివి జరుగుతాయి.
  • ఫోన్​ నెంబరు ఎండింగ్​ లో1,2,3 లాంటి  లో ఫ్రీక్వెన్సీ నంబర్లు ఉండకూడదు. ఎప్పుడూ రైజింగ్​ నంబర్లు ఉండాలి. 
  • 5,  6,9 ఈ నెంబర్లు మాత్రమే ఎండింగ్​లో అనగా 10 వ నెంబర్​ స్థానంలో ఉండే విధంగా చూసుకోవాలని సంఖ్యా శాస్త్రనిపుణులు చెబుతున్నారు.  అంతే కాకుండా.. మీపుట్టిన తేది.. మీ వృత్తి ని ఆధారంగా చేసుకొని సంఖ్యా శాస్త్ర నిపుణుల సూచనల మేరకు ఫోన్​ నంబర్​ తీసుకొంటే చాలా అద్భుతాలు కలిసి వస్తాయని సంఖ్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.