మేషం
ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అందరిలోనూ ప్రత్యేకత సాధిస్తారు. చిన్ననాటిస్నేహితులను కలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆదాయం ఆశాజనకమే. కొన్ని బాకీలు వసూలవుతాయి. కుటుంబసభ్యులతో సఖ్యత. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామిక, కళారంగాల వారు అనుకున్న ప్రగతి సాధిస్తారు. వారాంతంలో ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం.
వృషభం
కార్యక్రమాల్లో విజయం. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబసభ్యుల సహకారంతో ఆశయాలు నెరవేరతాయి. భూ, వాహనయోగాలు. విద్యార్థులకు శుభవార్తలు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆకస్మిక ధనలాభం. ఇంటిలో శుభకార్యాలు చేస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులు సమస్యలు తీరతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారారంభంలో మానసిక ఆందోళన. శారీరకరుగ్మతలు. స్నేహితులతో తగాదాలు.
మిథునం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఆలోచనల అమలు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. సోదరులు, సోదరీలతో సఖ్యత. సమస్యల నుంచి బయటపడతారు. దేవాలయ దర్శనాలు. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. వారం మధ్యలో అనుకోని తగాదాలు. శారీరక రుగ్మతలు. ఖర్చులు.
కర్కాటకం
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి సాయం అందుతుంది. అప్పులు తీరతాయి. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి రాగలదు. వాహనాలు, స్థలాలు కొంటారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. అందరిలోనూ గుర్తింపు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారులకు అనుకోని లాభాలు, పెట్టుబడులు. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు. వారాంతంలో అనారోగ్యం, ఔషధసేవనం. ఆకస్మిక ప్రయాణాలు.
సింహం
కొత్త విషయాలు తెలుస్తాయి. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. పరపతి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. అదనపు ఆదాయం. ఆకస్మిక ధనలబ్ధి. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. భూములు కొంటారు. చిన్న నాటి స్నేహితులను కలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు అధికలాభాలు లభించే వీలుంది. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు.
కన్య
ఆదాయం ఆశించినంతగా లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కాంట్రాక్టులు చేజారవచ్చు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బంధువులు, స్నేహితులతో విరోధాలు. తరచూ ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిభారం.పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారారంభంలో అనుకోని ఖర్చులు. బంధువులతో వివాదాలు.
తుల
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఇంటాబయటా అనుకూల వాతావరణం. మీ భావాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారులకు ఊహించని లాభాలు, పెట్టుబడులు. ఉద్యోగులకు సంతోషకర సమాచారం. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారాంతంలో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు.
వృచ్చికం
మొదట్లో కొన్ని చికాకులు ఉన్నా క్రమేపీ అనుకూలిస్తుంది. రాబడి పెరిగి, అప్పులు తీరుస్తారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి. అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తారు. వాహనాలు కొంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారులకు లాభసాటి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారారంభంలో వివాదాలు. ఆరోగ్య సమస్యలు. మానసిక అశాంతి.
ధనస్సు
శ్రమ ఫలించే సమయం. కార్యక్రమాల్లో విజయం. అనుకున్న కాంట్రాక్టులు దక్కుతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆకట్టుకుంటాయి. ఆకస్మిక ధనలాభ సూచన. కుటుంబసమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారుూలు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అనుకూలం. వారం మధ్యలో శారీరక రుగ్మతలు. సోదరులతో కలహాలు. మనశ్శాంతి లోపిస్తుంది.
మకరం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. సంఘంలో పలుకుబడి. కొత్త వ్యూహాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సోదరులు, సోదరీలతో సఖ్యత. ఆరోగ్యం కుదుటపడుతుంది. పాతబాకీల వసూలు. అప్పులు తీరుస్తారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. కళాకారులు సన్మాన, సత్కారాలు పొందుతారు. వారారంభంలో అనుకోని ఖర్చులు. బంధువులతో వైరం.
కుంభం
కొన్ని సమస్యలు తీరతాయి. కార్యజయం. వాహనాలు, స్థలాలు కొంటారు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఆలోచనలకు కార్యరూపం. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదనపు ఆదాయం. అన్నింటా కుటుంబసభ్యులు సహకరిస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు. కళాకారులకు అప్రయత్నంగా అవకాశాలు. వారాంతంలో ఆస్తి వివాదాలు. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త.
మీనం
క్రమేపీ ఆదాయం మెరుగుపడుతుంది. కార్యక్రమాలు సమయానికి పూర్తి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలు, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు పదవీయోగం. సన్మానాలు. వారారంభంలో వృథా ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. దూరప్రయాణాలు.