మన్సూర్ అలీఖాన్ పై పోలీసులు కేసు నమోదు

తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ పై చెన్నై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. హీరోయిన్ త్రిషపై అసభ్యమైన కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 354A, 509 కింద కేసు నమోదు చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శంకర్ జివాల్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. అంతకుముందు   మన్సూర్ అలీఖాన్ పై  కేసు నమోదు చేయాలని  జాతీయ మహిళా కమిషన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.  

త్రిషపై తాను గురించి తప్పుగా ఏం మాట్లాడలేదన్నారు   మన్సూర్ అలీఖాన్. ఆమెకు క్షమాపణలు చెప్పేది లేదన్నారు .  తానేంటో తమిళనాడు ప్రజలకు తెలుసని, వారి మద్దతు తనకు ఉందన్నారు.  సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లా? సినిమాల్లో రేప్‌ చేస్తే నిజంగానే చేసినట్లా? అని మన్సూర్ అలీఖాన్ సమర్థించుకున్నారు. 

ఇంతకీ ఏం జరిగింది అంటే ? 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్..  లియో సినిమాలో హీరోయిన్  త్రిషతో ఓ సీన్‌ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్‌ సీన్లలో నటించా. లియోలో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందని అనుకున్నా. కాకపోతే, అలాంటి సీన్‌ లేకపోవడం బాధగా అనిపించింది అని మన్సూర్‌ అలీఖాన్‌ అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

త్రిష రియాక్షన్  ఎంటీ ?  

అటు  మన్సూర్ అలీఖాన్ కామెంట్స్ పై హీరోయిన్ త్రిష కూడా రియాక్ట్ అయింది. మన్సూర్ అలీ ఖాన్ నా గురించి అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అలాంటి వ్యక్తితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనందుకు సంతోషంగా ఉంది. నా ఫిల్మ్‌కెరీర్‌లో ఇలాంటి వారితో నటించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తోంది అంటూ ట్వీట్ చేసింది.

ALSO READ :- ఇన్నోవా హైక్రాస్​ లిమిటెడ్​ ఎడిషన్​ వచ్చేసింది..