
- రూ.17 లక్షలు అందజేసిన నర్సింగ్ క్లాత్ ఎంపోరియం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హరే కృష్ణ మూవ్‌మెంట్ సంస్థ రూపొందించిన హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్టుకు శ్రీ నర్సింగ్ క్లాత్ ఎంపోరియం సంస్థ భారీ విరాళాన్ని అందజేసింది. ఆ సంస్థ ఎండీ సంజయ్ సింఘానియా, డైరెక్టర్ రవికాంత్ సింఘానియా ప్రాజెక్ట్ కోసం రూ.17 లక్షలను హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర దాస ప్రభూజీకి సోమవారం అందజేశారు.
ఈ విరాళంతో కలిపి నర్సింగ్ క్లాత్ సంస్థ 2024–25 సంవత్సరానికి రూ. 42 లక్షలను అందించినట్లు సత్య గౌర చంద్ర దాస ప్రభూజీ తెలిపారు. ఇందుకు ఆ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. నర్సింగ్క్లాత్ఎంపోరియం ఎండీ సంజయ్ సింఘానియా, డైరెక్టర్రవికాంత్సింఘానియా మాట్లాడుతూ.. సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి తమ సంస్థ సహకరిస్తుందని తెలిపారు.